Jump to content

మారేడు

వికీపీడియా నుండి

మారేడు
Scientific classification
Kingdom:
Division:
Class:
Subclass:
Order:
Family:
Genus:
ఎగెల్
Species:
ఎ. మార్మలోస్
Binomial name
ఎగెల్ మార్మలోస్
బిల్వపత్రి

మారేడు లేదా బిల్వ (Bael). ఈ కోవకు చెందిన కుటుంబం చెందిందే వెలగ కూడాను. ఈ బిల్వపత్రి పత్రి బిల్వ వృక్షానికి చెందింది. వినాయక చవితి రోజు చేసుకునే వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రపూజ క్రమంలో ఈ ఆకు రెండవది.[1]

భౌతిక లక్షణాలు

[మార్చు]

మారేడు 8 నుండి 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. దీని ఆకులు సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తూ ఉంటాయి. దీని పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉండి, కమ్మని వాసనని కలిగి ఉంటాయి. మారేడు కాయలు గట్టిగా ఉంటాయి. విత్తనాలు చాలా ఉంటాయి. మారేడు గుజ్జు కూడా సువాసనగా ఉంటుంది.

ఆయుర్వేదంలో

[మార్చు]

ఈ పత్రి ఉల్లేఖన ఆయుర్వేదంలో ఉంది. ఇది అతిసార వ్యాధికి, మొలలకు, చక్కెర వ్యాధి రోగాల నివారణకు ఉపయోగపడుతుంది.

పుట్టు పూర్వోత్తరాలు

[మార్చు]

భారతదేశంతో పాటుగా ఆసియా దేశాలలో చాలా వరకూ మారేడు చెట్టు పెరుగుతుంది. ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం మారేడు.

ఔషధ గుణాలు

[మార్చు]

ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు:

  1. అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందు.
  2. మొలలకు ఇది మంచి ఔషధము.
  3. దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది

సువాసన గుణం

[మార్చు]

ఈ పత్రి సుగంధభరితంగా ఉంటుంది.

ఇందులో గల పదార్థాలు

[మార్చు]

ఖనిజాలు, విటమినులు, చాలా ఉంటాయి. కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, కెరోటిన్, బి-విటమిన్, సి-విటమిను ముఖ్యమైనవి. మారేడు ఆకులలో, పళ్లలో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి.

మారేడులో అన్ని భాగాలు ఔషధ గుణాలు

[మార్చు]
మారేడు పండు

మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. బిల్వ వృక్షములో ప్రతి భాగము మానవాళికి మేలు చేసేదే.

  • మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది. ఉపయోగాలు
  • మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి.
  • అతిసార వ్యాధికి దీని పండ్ల రసం చాలా మంచి మందు.
  • ఆయుర్వేదములో వాడు దశమూలం లలో దీని వేరు ఒకటి.
  • మొలలకు ఇది మంచి ఔషధము.
  • దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
  • బిల్వ ఆకులు జ్వరాన్ని తగ్గిస్తాయి . . . బిల్వ ఆకుల కషాయము తీసి అవసరము మేరకు కొంచం తేనె చుక్కలు కలిపి తాగితే జ్వరము తగ్గుతుంది .
  • కడుపు లోను, పేగుల లోని పుండ్లు తగ్గించే శక్తి బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది,
  • మలేరియాను తగ్గించే గుణము బిల్వ ఆకులకు, ఫలాలకు ఉన్నది,
  • బిల్వ ఫలం నుండి రసం తీసి దానికి కొద్దిగా అల్లం రసం కలిపి తాగితే రక్తసంబంధిత ఇబ్బందులనుండి ఉపశమనం కలుగుతుంది .
  • బిల్వ వేరు, బెరడు, ఆకులను ముద్దగా నూరి గాయాల మీద అద్దితే త్వరగా మానుతాయి.
  • క్రిమి, కీటకాల విషానికి విరుగుడుగా పనిచేస్తుంది .

ఉపయోగాలు

[మార్చు]
  • మారేడు పండ్లు, కాయలు, బెరడు, వేళ్ళు, ఆకులు, పూవులు ఆన్నీ కూడా ఔషధములుగా ఉపయోగపడతాయి. అతిసార వ్యాధికి దీని పండ్ల రసాయనం చాలా మంచి మందు. ఆయుర్వేదములో వాడు దశమూలము లలో దీని వేరు ఒకటి. మొలలకు ఇది మంచి ఔషధము. దీని ఆకుల రసము చక్కెర వ్యాధి నివారణకు చాలా మంచిది.
  • మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది.
  • సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.
  • మారేడు గుజ్జుని పాలు, పంచదారతో కలిపి తీసుకుంటే వేసవి పానీయంగా కూడా బావుంటుంది. ప్రేవులను శుభ్రపరచడమే కాకుండా, వాటిని శక్తివంతంగా కూడా తయారుచేస్తుంది.
  • మారేడులో ఉన్న విచిత్రం ఏమిటంటే బాగా పండిన పండు విరేచనకారిగా ఉపయోగపడితే, సగంపండిన పండు విరేచనాలు ఆగటానికి ఉపయోగపడుతుంది.
  • జిగురు విరేచనాలవుతున్నా సగం పండిన మారేడు పండు ఎంతో ఉపకరిస్తుంది.
  • విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుముగా చేసినది బాగా ఉపకరిస్తుంది.
  • మారేడు ఆకుల కషాయాన్ని కాచుకుని తాగితే హైపవర్ ఎసిడిటీ లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి.
  • మారేడు ఆకుల కషాయాన్ని నువ్వుల నూనెతో కలిపి కాచి, దానిని తలస్నానానికి ముందుగా రాసుకుంటే తలస్నానం చేసిన తర్వాత జలుబు, తుమ్ములు వచ్చేవారికి బాగా ఉపయోగపడుతుంది.
ఈ పత్రితో ఉన్న ఇతర ఉపయోగాలు
  • 1.మారేడు పండ్ల వాసన చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీనిని శరీరానికి చల్లదనాన్నిచ్చే గుణం ఉంది. అలాగే విరేచనకారిగా కూడా పనిచేస్తుంది.[2]
  • 2.సగం పండిన పండు జీర్ణ శక్తిని పెంచుతుంది. బాగా పండిన పండులోని గుజ్జు రోజూ తింటే దీర్ఘకాలికంగా మలబద్ధ సమస్యతో సతమతమయ్యే వారికి ఎంతో ఉపయోగపడుతుంది.[3]
  • 3.విరేచనాలు తగ్గడానికి గుజ్జుగా కంటే ఎండబెట్టి, పొడుముగా చేసినది బాగా ఉపకరిస్తుంది.[4]

హిందూమతంలో మారేడు

[మార్చు]

మారేడు లేదా బిల్వము[5] హిందూ దేవతలలో ఒకరైన శివపూజలో ముఖ్యం. మారేడు దళాలు లేకుండా శివార్చన లేదు. హిందువులకు మారేడు వృక్షం చాలా పవిత్రమైనది. దీని గురించి వేదకాలంనాటి నుంచీ తెలుసు. దేవాలయాలలో ఇది ప్రముఖంగా కన్పిస్తుంది. శివునికి ఇదంటే బహుప్రీతి. మారేడు అకులు మూడు కలిపి శివుని మూడు కళ్ళలా ఉంటాయి. శివుడు ఈ మారేడు చెట్టు క్రింద నివాసం ఉంటాడని ప్రతీతి.[6]

బిల్వ పత్ర మహిమ

[మార్చు]

మారేడు లేదా బిల్వము (Bael) హిందూ దేవతలలో ఒకడైన శివపూజలో ముఖ్యం. * శివుని బిల్వ పత్రములతో పూజించుట శ్రేష్టము. బిల్వ వృక్షము సాక్షాత్తు శివస్వరూపమని దేవతలు భావించెదరు. శివపురాణంలో బిల్వపత్రం[7] మహిమను తెలిపే కథ ఉంది. ఒకనాడు శనిదేవుడు, శివుని దర్శించుటకై కైలాసమునకేగి పార్వతీ పరమేశ్వరులను దర్శించి భక్తితో స్తుతించాడు. అంతట శివుడు శనిదేవుని విధి ధర్మమును పరీక్షించు నెపమున నీవు నన్ను పట్టగలవా? అని ప్రశ్నించాడు. అందుకు శని మరునాటి సూర్యోదయము నుండి సూర్యాస్తమయ కాలము వరకూ శివుని పట్టి ఉంచగలనని విన్నవించాడు. అంత శివుడు మరునాటి ఉషోదయ కాలమున బిల్వవృక్షరూపము దాల్చి, ఆ వృక్షమునందు అగోచరముగా నివసించాడు. మహేశ్వరుని జాడ తెలియక పార్వతీదేవితో సహా దేవతలందరు ముల్లోకములనూ గాలించారు. వారెవ్వరికి ఆ మహేశ్వరుని జాడగానీ, శనిదేవుని జాడగానీ తెలియలేదు. ఆనాటి సూర్యాస్తమయ సంధ్యాకాలము గడచిన పిదప మహేశ్వరుడు బిల్వ వృక్షము నుండి సాకార రూపముగా బయలు వెడలినాడు. మరుక్షణమే శనిదేవుడు అచట ప్రత్యక్షమైనాడు. "నన్ను పట్టుకోలేకపోయావే?" అని పరమేశ్వరుడు ప్రశ్నించగా శనిదేవుడు నమస్కరించి "నేను పట్టుటచేతనే గదా, లోకారాధ్యులు తమరు ఈ బిల్వ వృక్షరూపముగా ఇందులో దాగి వసించినారు" అన్నాడు. శనిదేవుని విధి నిర్వహణకు, భక్తి ప్రపత్తులకు మెచ్చిన శివుడు "ఈశ్వరుడినైన నన్నే కొద్దికాలము పట్టి, నాయందే నీవు వసించి యుండుటచేత నేటినుండి నీవు 'శనీశ్వరుడు' అను పేర ప్రసిద్ధి నొందగలవు. అంతట శని దోషమున్న వారు, ఆ దోషమున్నవారు, ఆ దోషపరిహారార్ధము నన్ను బిల్వ పత్రములలో పూజించిన దోష నివృత్తి జరుగును. బిల్వ పత్ర పూజ చేత శివభక్తులైన వారిని ఈ శనీశ్వరుడు బాధించడు' అని అభయమిచ్చెను.

  • లక్ష్మీదేవి తపస్సు వలన బిల్వవృక్షము పుట్టినది. ఆమెను 'బిల్వనిలయా' అని పిలుస్తారు. * బ్రహ్మ వర్చస్సు పొందడానికి, సూర్యుని మెప్పుకోసం చేసే కామ్య యాగంలో బిల్వకొయ్యను యూప స్తంభముగా నాటుతారు. అశ్వమేధ యాగములో ఇలాంటి బిల్వయూపములను ఆరింటిని ప్రతిష్టించుతారు.
  • మారేడు దళాన్ని సోమవారము, మంగళ వారము, ఆరుద్రానక్షత్రము, సంధ్యాసమయము, రాత్రి వేళలందు, శివరాత్రి రోజున, సంక్రాంతి రోజున, పండుగల సమయాన కోయకూడదు. కనుక ఈ దళాలను ముందు రోజు కోసి, భద్రపరచిన దళాలతో పరమశివుని పూజిస్తారు.
  • మారేడు దళము శివార్చనకు పనికి వచ్చే, శివుడికి అతి ప్రీతికరమైన పత్రము.
  • మారేడుదళము గాలిని, నీటిని దోషరహితము చేస్తుంది.

ఇతర భాషలలో పేర్లు

[మార్చు]

తెలుగు వారి కి సుపరిచిత నామం మారేడు.

  • సంస్కృతంలో "బిల్వ్"
  • హిందీలో "బేల్"
  • In Banjara (lambaadi lo)language it is called as "billa" (prabhaas movie name)
  • ఉర్దూలో దీనిని "బేల్" లేదా "సీర్ ఫల్" అని పిలుస్తారు.
  • దక్కనీ ఉర్దూలో దీనిని "కబీట్" అని అంటారు.
  • మరాఠీ భాషలో "బేల్" లేదా "కవీట్" అనీ అంటారు.

చిత్రమాలిక

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
  • FOREST FLORA OF ANDHRA PRADESH
  • "bilva maredu dalam is used of shiva maredu health-tips". ttelangana.in-date=2023-01-28 (in telugu-india).{{cite news}}: CS1 maint: unrecognized language (link)

మూలాలు

[మార్చు]
  1. "వినాయకుడి పత్రిలతో కరోనా సంహారం!". web.archive.org. 2021-10-04. Archived from the original on 2021-10-04. Retrieved 2021-10-04.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "అమోఘమైన ఔషధాలు కలిగి ఉన్న మారేడు చెట్టు". Archived from the original on 2022-09-25. Retrieved 2022-04-12.
  3. "మారేడు (బిల్వం) చెట్టు ప్రాముఖ్యత మీకు తెలుసా ఆయుర్వేద ఉపయోగాలు - ఆధ్యాత్మిక విశేషాలు - చెట్టు లోని ఔషధ గుణాలు". Archived from the original on 2021-10-17. Retrieved 2022-04-12.
  4. "బిల్వపత్రాన్ని శివుడు ఎందుకు అంతగా ఇష్టపడతాడంటే."
  5. "మారేడూ చెట్టును ఇంట్లో ఉంచుకోవచ్చా". 2022-02-14.
  6. "మారేడు వృక్షం విశిష్టత ఏంటి". 2020-11-22.
  7. "బిల్వ పత్రం". 2015-03-17.
"https://te.wikipedia.org/w/index.php?title=మారేడు&oldid=4311348" నుండి వెలికితీశారు