Jump to content

మే 2008

వికీపీడియా నుండి
వర్తమాన ఘటనలు | 2008 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | వికీపీడియా ఘటనలు | 2007 ఘటనలు
మే 1, 2008 (2008-05-01)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ప్రముఖ గాంధేయవాది, రాజ్యసభ సభ్యురాలు నిర్మలా దేశ్ పాండే మృతి.
  • ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సిబిడిటి) చైర్మెన్‌గా రబీందర్ సింగ్ నియమితులయ్యాడు.
  • ప్రసార భారతి చైర్మెన్‌గా అరుణ్ భట్నాగర్ బాధ్యతలు స్వీకరించాడు.
  • ప్రపంచంలోనే సముద్రంపై నిర్మించిన అతి పొడవైన వంతెనను చైనాలో ప్రారంభించారు.
మే 2, 2008 (2008-05-02)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
మే 3, 2008 (2008-05-03)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
మే 4, 2008 (2008-05-04)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
మే 5, 2008 (2008-05-05)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
మే 6, 2008 (2008-05-06)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • భారత్‌కు రూ.19.50 లక్షల కోట్ల రుణభారం ఉన్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది.
  • చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన 108వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
  • ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు మాస్కోలో ఉన్నట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఈ విషయంలో ముంబాయి 7వ స్థానంలో ఉంది.
  • మయన్మార్ లో నర్గీస్ తుఫాను మృతుల సంఖ్య 23వేలకు చేరింది.
మే 7, 2008 (2008-05-07)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • రష్యా అద్యక్షుడిగా దిమిత్రి మెద్వెదెవ్ పదవీబాధ్యతలు స్వీకరించాడు. ఇతడు రష్యాకు మూడవ అద్యక్షుడు. పిన్న వయస్సులో అద్యక్షుడైన ఘనత సాధించాడు.
  • ఒరిస్సాలోని వీలర్ దీవి నుంచి అగ్ని-3 క్షిపణి ప్రయోగం విజయవంతమైంది.
  • సాహసోపేత విధులను నిర్వహించిన 65 సైనికులకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సేవాపతకాలను బహుకరించింది. వీరిలో నలుగిరికి కీర్తిచక్ర లభించగా, 22 మందికి శౌర్యచక్ర, 13 మందికి పరమవిశిష్ట, 26 గురికి అతివిశిష్ట సేవాపతకాలు లభించాయి.
మే 8, 2008 (2008-05-08)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
మే 9, 2008 (2008-05-09)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • తెలంగాణా పోరాటయోధుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు బి.ఎన్.రెడ్డి హైదరాబాదులో మృతిచెందాడు. ఇతడు గతంలో రెండు పర్యాయాలు రాష్ట్ర శాసనసభకు, మూడు పర్యాయాలు లోక్‌సభకు ఎన్నికైనాడు.
మే 10, 2008 (2008-05-10)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • ప్రభుత్వరంగ సంస్థ భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెస్సెల్స్ ను భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో విలీనం చేశారు.
  • కర్ణాటక శాసనసభ ఉప ఎన్నికల తొలిదశ పోలింగ్ 89 నియోజకవర్గాలలో ముగిసింది.
  • చెన్నైలో జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో లక్ష్మీపతి బాలాజీ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు చెందిన ఇర్ఫాన్ పఠాన్, చావ్లా, విఆర్వీసింగ్ లను వరుసబంతుల్లో ఔట్ చేసి ఐపిఎల్‌లో తొలి హాట్రిక్ నమోదుచేశాడు.
మే 11, 2008 (2008-05-11)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
మే 12, 2008 (2008-05-12)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
మే 13, 2008 (2008-05-13)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • పింక్ సిటీగా పెరుపొందిన జైపూర్ లో ఉగ్రవాదులచే 8 బాంబుపేలుళ్ళు, 75 మంది మృతి.
మే 14, 2008 (2008-05-14)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
మే 15, 2008 (2008-05-15)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
మే 16, 2008 (2008-05-16)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
మే 17, 2008 (2008-05-17)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • కర్నూలు జిల్ల్లాలో జరిగిన ఫ్యాక్క్షనిజం దాడిలో తెలుగుదేశం పార్టీ నేత వెంకటప్పనాయుడు దారుణహత్యకు గురైనాడు.
  • మలేషియాలో జరుగుతున్న అజ్లాన్‌షా హాకీ టోర్నమెంటులో భారత్ ఫైనల్ చేరింది.
  • ప్రపంచ మహిళా బ్యాట్మింటన్‌లో ప్రముఖమైన ఉబెర్ కప్‌ను చైనా వరుసగా ఆరవసారి కైవసం చేసుకుంది.
మే 18, 2008 (2008-05-18)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • మలేషియాలో జరిగిన అజ్లాన్‌షా పురుషుల హాకీ టోర్నమెంటు ఫైనల్లో భారత్ పై అర్జెంటీనా 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
  • థామస్ కప్ (పురుషుల బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్)ను చైనా వరుసగా మూడవసారి కైవసం చేసుకుంది.
మే 19, 2008 (2008-05-19)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
మే 20, 2008 (2008-05-20)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • తైవాన్ అధ్యక్షుడిగా మా యింగ్ జ్యో పదవీ బాధ్యతలు స్వీకరించాడు.
మే 21, 2008 (2008-05-21)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
మే 22, 2008 (2008-05-22)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
మే 23, 2008 (2008-05-23)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • కర్ణాటకలో శాసనసభ ఉపఎన్నికల తుదిదశ ఓటింగ్ ముగిసింది. మే 25న ఓటింగ్ లెక్కింపు జరుగుతుంది.
  • చైనా భూకంపం మృతుల సంఖ్య 51,000కి పెరిగినట్లు చైనా అధికారులు ప్రకటించారు.
మే 24, 2008 (2008-05-24)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
మే 25, 2008 (2008-05-25)!(ఆదివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • కర్ణాటక శాసనసభ ఉపఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలలో విజయం సాధించింది. 224 స్థానాలు కల శాసనసభలో మెజారిటీకి 110 నియోజకవర్గాలలో గెలిచింది.
మే 26, 2008 (2008-05-26)!(సోమవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • రాజస్థాన్‌లో గుజ్జర్ సమాజ్ మహాపంచాయిత్ సమితికి చెందిన వారు తమ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలని ఆందోళన కొనసాగిస్తున్నారు.
మే 27, 2008 (2008-05-27)!(మంగళవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • రాజు జ్ఞానేంద్ర రాజభవనాన్ని విడిచి వెళ్ళవలసిందిగా నేపాల్ ప్రభుత్వం హెచ్చరించింది.
మే 28, 2008 (2008-05-28)!(బుధవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • నేపాల్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది. సుమారు 240 సంవత్సరాల రాచరిక పాలన ముగిసింది.
  • కర్ణాటకలో రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని కేంద్రపభుత్వం నిర్ణయించింది.
  • కర్ణాటక కామ్గ్రెస్ శాసనసభప్క్షనేతగా మల్లికార్జున ఖర్గే ఎన్నికయ్యాడు.
  • మయన్మార్ ప్రతిఉపక్ష నాయకురాలు, నోబెల్ బహుమతి విజేత అయిన ఆంగ్ శాన్ సూకీ గృహనిర్భంధాన్ని సైనిక ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది.
మే 29, 2008 (2008-05-29)!(గురువారం) మార్చు చరిత్ర వీక్షించు
మే 30, 2008 (2008-05-30)!(శుక్రవారం) మార్చు చరిత్ర వీక్షించు
  • కర్ణాటక ముఖ్యమంత్రిగా బి.ఎస్.యడ్యూరప్ప ప్రమాణస్వీకారం. 65 సంవత్సరాల యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది రెండోసారి.
మే 31, 2008 (2008-05-31)!(శనివారం) మార్చు చరిత్ర వీక్షించు
  • అంతర్జాతీయ సైకత శిల్పాల పోటీలలో ఒరిస్సాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ గ్లోబల్ వార్మింగ్‌పై రూపొందించిన శిల్పానికిగాను "పీపుల్స్ ఛాయిస్" అవార్డును గెల్చుకున్నాడు.
  • ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ రికీ పాంటింగ్ టెస్టులలో 10,000 పరుగుల మైలురాయిని అధికమించి ఈ ఘనతపొందిన మూడవ ఆస్ట్రేలియన్‌గా గుర్తింపు పొందినాడు.
"https://te.wikipedia.org/w/index.php?title=మే_2008&oldid=811018" నుండి వెలికితీశారు