మార్చి 2008
Appearance
వర్తమాన ఘటనలు | 2008 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | వికీపీడియా ఘటనలు | 2007 ఘటనలు |
- మార్చి 31, 2008
- ప్రముఖ హిందీ నటి వహీదా రెహమాన్‌కు 2006 సంవత్సరపు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం లభించింది.
- ప్రముఖ సినీ నిర్మాత డి.రామానాయుడుకు 2006 సవత్సరపు రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషన్ అధికారిగా ఐ.వి. సుబ్బారావు బాధ్యతలు స్వీకరించాడు.
- బీజింగ్ ఒలింపిక్స్ జ్యోతి రిలే అధికారికంగా ప్రారంభమైంది.
- మార్చి 30, 2008
- భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరిగిన చెన్నై టెస్ట్ డ్రాగా ముగిసింది. ట్రిపుల్ సెంచరీ వీరుడు వీరేంద్ర సెహ్వాగ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు లభించింది.
- మార్చి 29, 2008
- చెన్నై లోని చేపాక్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టెస్ట్ క్రికెట్లో వీరేంద్ర సెహ్వాగ్ 319 పరుగులు చేసి తన రికార్డును తానే అధికమించాడు.
- రాహుల్ ద్రవిడ్ టెస్టులలో 10,000 పరుగులు పూర్తి చేసి ఈ ఘనత సాధించిన ఆరవ బ్యాట్స్‌మెన్‌గాను, మూడవ భారతీయుడిగాను స్థానం సంపాదించాడు.
- మార్చి 28, 2008
- చెన్నై లోని చేపాక్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో వీరేంద్ర సెహ్వాగ్ రెండో ట్రిపుల్ సెంచరీని సాధించాడు. ఇది టెస్ట్ క్రికెట్ లో అతివేగవంతమైన ట్రిపుల్ సెంచరీ. భారత్ తరఫున ఇది రెండో ట్రిపుల్ సెంచరీ కాగా, రెండూ అతని పేరిటే నమోదై ఉన్నాయి.
- ద్రవ్యోల్భణ రేటు ఈ ఏడాదిలోనే గరిష్ఠంగా 6.68 %గా నమోదైంది.
- మార్చి 27, 2008
- సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మళ్ళీ ఏ.బి.బర్దన్ ఎంపికైనాడు. ఇతడు ఈ పదవిని చేపట్టడం ఇది నాలుగవ సారి. 1990 నుంచి ఈ పదవిలో కొనసాగుతున్నాడు.
- సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడిగా ములాయం సింగ్ యాదవ్ మళ్ళీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. 1990 నుంచి ములాయం ఈ పదవిలో కొనసాగుతున్నాడు.
- మార్చి 26, 2008
- భూటాన్లో తొలిసారిగా జరిగిన ప్రజాస్వామ్య ఎన్నికలలో గెలిచి జిగ్మీ ధిన్లే ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. యాహూ తెలుగు వార్తలు
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఐ.వి.సుబ్బారావు నియమితుడయ్యాడు. సాక్షి తెలుగు పత్రిక
- మార్చి 25, 2008
- కాంగ్రెస్ పార్టీ టికెట్టుపై గెలిచి హర్యానా జనహిత్ కాంగ్రెస్ అనే కొత్త పార్టీ పెట్టినందున హర్యానా మాజీ ముఖ్యమంత్రి భజన్ లాల్ పై ఫిరాయింపుల నిరోధకచట్టం క్రింద నిరోధం విధించారు.
- పాకిస్థాన్ కొత్త ప్రధానమంత్రిగా సయ్యద్ యూసఫ్ రజా గిలానీ ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు చేపట్టాడు.
- మార్చి 24, 2008
- 2006లో ఏర్పాటు చేసిన బీఎన్ శ్రీకృష్ణ నేతృత్వంలోని ఆరవ వేతన సంఘం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కేంద్ర ప్రభుత్వోద్యుగుల వేతనాలను 40% పెంచాలని, కనిష్ఠ వేతనం రూ. 6600 ఉండాలని సిఫార్సు చేసింది.
- భూటాన్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైనది.
- పసిఫిక్ లై ఓపెన్ టెన్నిస్‌లో పురుషుల, మహిళ టైటిళ్ళను వరుసగా జకోవిక్ (సెర్బియా), ఇవానోవిక్ (సెర్బియా) లు గెలుచుకున్నారు.
- మార్చి 23, 2008
- కొత్తగా నిర్మించిన రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 22 అర్థరాత్రి నుంచి విమాన రాకపోకలు ప్రారంభమయ్యాయి. లుప్తాన్సా ఎయిల్ లైన్స్‌కు చెందిన విమానం మొదటిసారిగా ఇక్కడికి చేరింది.
- ఒరిస్సాలోని బాలాసోర్ వద్ద వీలర్స్ ద్వీపంలో అగ్ని-1 క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించిందిం. ఈ క్షిపణికి అణ్వాయుధాలు మోసుకెళ్ళగల సామర్థ్యం ఉంది.
- కొత్త ప్రధానమంత్రి పదవికి యూసఫ్ రజా గిలానీ పేరును పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ ప్రకటించింది.
- మార్చి 22, 2008
- చైనా వాయవ్య ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.3 పాయింట్ల తీవ్రత నమోదైనది.
- దేశంలో 20 కొత్త టెలివిజన్ ఛానెళ్ళ ఏర్పాటుకు రిలయెన్స్ నిర్ణయం.
- ఇంగ్లాండు క్రికెటర్ మార్కస్ ట్రెస్కోథిక్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటించాడు. ఇతను ఇంగ్లాండు తరఫున 76 టెస్టులు, 120 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు.
- మార్చి 21, 2008
- చెన్నైలోని శాంతొనికేతన్ తోటలో శోభన్ బాబు అంత్యక్రియలు జరిగాయి.
- శంషాబాదు లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 23 అర్థరాత్రి నుంచి విమానాల రాకపోకలను ప్రారంభించనున్నారు.
- మార్చి 20, 2008
- ప్రముఖ తెలుగు సినీనటుడు శోభన్ బాబు చెన్నైలో మృతి.
- ప్రముఖ బెంగాలీ రచయిత్రి తస్లీమా నస్రీన్ భారత్‌ను వదిలి గుర్తు తెలియని ప్రదేశానికి వెళ్ళింది.
- ద్రవ్యోల్బణం 11 నెలల గరిష్ఠ స్థాయికి చేరి 5.92%గా నమోదైంది.
- మార్చి 19, 2008
- ప్రముఖ సంఘసేవిక గుర్రం జాషువా కుమార్తె హీమలతా లవణంమృతి.
- మేఘాలయ ముఖ్యమంత్రి పదవికి డి.డి.లపాంగ్ రాజీనామా
- పాకిస్తాన్ లోని తక్షశిలలో 2000 సంవత్సరాల నాటి బుద్ధ విగ్రహం లభ్యమైంది.
- మార్చి 18, 2008
- పాకిస్తాన్ తొలి మహిళా స్పీకర్‌గా ఫామిదా మీర్జాను నియమించాలని పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నిర్ణయించింది.
- ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలలో హైదరాబాదు జట్టు పేరు దక్కన్ చార్జర్స్‌గా మార్చుకుంది.
- ఐసిసి ఛీప్ ఎగ్జిక్యూటివ్‌గా ఇంతియాజ్ పటేల్ నియమించబడ్డాడు. ఇతడు దక్షిణాఫ్రికాకు చెందిన భారత సంతతి వ్యక్తి.
- మార్చి 17, 2008
- టిబెట్‌లో విదేశీ పర్యాటకుల పర్యాటనపై చైనా నిషేధం విధించింది.
- ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను బ్రిటన్‌కు చెందిన లూయిస్ హామిల్టన్ చేజిక్కించుకున్నాడు.
- బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీలో మళ్ళీ భారీ పతనం, సూచీ 15,000 దిగువన పడిపోయింది.
- మార్చి 16, 2008
- చైనా ప్రధానిగా వెన్ జిబావో తిరిగి రెండోసారి ఎన్నికయ్యాడు.
- ఐసిసి తాజా వన్డే ర్యాంకింగ్‌లో దక్షిణాఫ్రికాకు చెందిన గ్రేమ్ స్మిత్ మొదటిస్థానం పొందినాడు.
- మార్చి 15, 2008
- అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజా వన్డే ర్యాంకుంగ్లో ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి ప్రథమస్థానం ఆక్రమించిన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు.
- చైనా అధ్యక్షుడిగా మళ్ళీ హు జింటావో ఎన్నిక, ఉపాద్యక్షుడిగా జిన్‌షింగ్ నియామకం.
- మార్చి 14, 2008
- హైదరాబాదులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయానికి సోనియా గాంధీ ప్రారంభోత్సవం.
- 2007 సంవత్సరపు ఇందిరాగాంధీ శాంతి బహుమతికై బిల్-మిలిండా గేట్స్ ఫౌండేషన్ ఎంపికయింది.
- మార్చి 13, 2008
- బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీలో మళ్ళీ భారీ పతనం. సూచీ సంఖ్య ఈ ఏడాదిలోనే కనిష్ఠస్థాయికి (15229 పాయింట్లు) చేరింది.
- మార్చి 12, 2008
- మేఘాలయలో ముఖ్యమంత్రి డి.డి.లపాంగ్ నేతృత్వంలో ఏడుగురు మంత్రుల ప్రమాణస్వీకారం.
- మార్చి 11, 2008
- మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం, ఇన్ఫోసిస్ చైర్మెన్ నారాయణ మూర్తిలు అమెరికాకు చెందిన ఉడ్రోవిల్సన్ అవార్డునకు ఎంపికయ్యారు.
- శంషాబాద్ లోని హైదరాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం మార్చి 16 నుంచి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించేందుకు అనుమతిస్తూ కేంద్ర పౌరవిమానాశ్రయ శాఖ ఉత్తర్వు జారీ.
- పాకిస్తాన్లో పర్యటించరాదని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు నిర్ణయించింది.
- ప్రముఖ మాజీ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా మళ్ళీ చెక్ రిపబ్లిక్ పౌరసత్వం తీసుకుంది.
- మార్చి 10, 2008
- చిలీలో జరిగిన ప్రపంచ హాకీ క్వాలిఫైయింగ్ పోటీ ఫైనల్‌లో ఇంగ్లాండు చేతిలో ఓడి ఒలింపిక్స్ లో పాల్గొనే అర్హత కోల్పోయింది.
- త్రిపుర ముఖ్యమంత్రిగా మూడవసారి మణిశంకర్ బాధ్యతలు చేపట్టాడు.
- మార్చి 9, 2008
- నాగాలాండ్ శాసనసభ ఎన్నికలలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ లభించలేదు. 60 స్థానాలు కల శాసనసభలో నాగాలాండ్ పీపుల్స్ పార్టీ 25 స్థానాలతో ముందంజలో ఉంది.
- మలేషియా పార్లమెంటు ఎన్నికలలో ప్రధానమంత్రి అబ్దుల్లా బదావీ నేతృత్వంలోని అధికార బారిసన్ నాసినల్ 130 స్థానాలు సాధించి ముందంజలో ఉంది.
- బెంగుళూరు ఓపెన్ టెన్నిస్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్ కైవసం చేసుకుంది.
- మార్చి 8, 2008
- కొత్తగా ఎన్నికలు జరిగిన మేఘాలయ శాసనసభకు కాంగ్రెస్ శాసనసభ పక్షనేతగా డి.డి.లపాంగ్ ఏకగ్రీవ ఎన్నిక.
- నేపాల్ రాజ్యాంగసభ ఎన్నికల దృష్ట్యా భారత్-నేపాల్ సరిహద్దును మార్చి 10 నుంచి మూసివేయాలని నిర్ణయం.
- భారత ప్రముఖ చదరంగం క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ మొరెలియా-లైనర్స్ టోర్నమెంటును రెండోసారి కైవసం చేసుకున్నాడు.
- హామిల్టన్‌లో న్యూజీలాండ్ పై జరుగుతున్న టెస్ట్‌లో ఇంగ్లాండు బౌలర్ సైడ్ బాటమ్ హాట్రిక్.
- మార్చి 7, 2008
- త్రిపుర శాసనసభ ఎన్నికలలో లెఫ్ట్ ఫ్రంట్ వరుసగా నాలుగవ సారి విజయం సాధించింది. 60 స్థానాలు కల శాసనసభలో లెఫ్ట్ ఫ్రంట్ 49 స్థానాలలో విజయం సాధించగా కాంగ్రెస్ 11 స్థానాలు పొందినది.
- మేఘాలయ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధిక స్థానాలు పొందినది. శాసనసభలో ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ చేకూరలేదు.
- తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యుల రాజీనామాలకు స్పీకర్ ఆమోదం.
- భారత్‌కు వ్యతిరేకంగా జరిగే ప్రచారానికి అనుమతించబోమని శ్రీలంక ప్రభుత్వం స్పష్టం చేసింది.
- బిఎస్ఇ స్టాక్ ఎక్ఛేంజీ సూచీ మరో 567 పాయింట్లు తగ్గి 15,975 పాయింట్లకు చేరింది.
- మార్చి 6, 2008
- మహారాష్ట్ర గవర్నరు పదవికి ఎస్.ఎం.కృష్ణ రాజీనామా. కర్ణాటక రాజకీయాలలో క్రియాశీలక పాత్ర నిర్వహించాలని నిర్ణయం
- వారెన్ బఫెట్ ప్రపంచంలోనే అతి కుబేరుడిగా ఫోర్బ్స్ పత్రిక ప్రకటించింది.
- ఆసియాలోనే పెద్దదైన దాణా కర్మాగారాన్ని మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో ఏర్పాటు చేయాలని సుగుణ పౌల్ట్రీ నిర్ణయించింది.
- మార్చి 5, 2008
- 60 నియోజకవర్గాలు కల నాగాలాండ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ముగిశాయి.
- తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటు సభ్యులు చేసిన రాజీనామాలు స్పీకర్‌చే ఆమోదం.
- హైదరాబాదులోని బేగంపేట విమానాశ్రయాన్ని మూసివేయరాదని సిఫార్సు చేయాలని సీతారాం ఏచూరి నేతృత్వంలోని స్టాండింగ్ కమిటీ నిర్ణయించింది.
- అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐఐసి) ర్యాంకింగ్‌లో (బ్యాటింగ్) సచిన్ టెండుల్కర్ మళ్ళీ ప్రథమస్థానంలోకి వచ్చాడు.
- మార్చి 4, 2008
- ఆంధ్ర ప్రదేశ్‌లో తెలంగాణ రాష్ట్ర సమితి శాసనభ్యులు తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్‌కు రాజీనామా పత్రాలు అందజేశారు.
- ఆస్ట్రేలియాలో జరుగుతున్న సిబి సీరీస్ రెండో ఫైనల్‌లో కూడా భారత్ విజయం సాధించి సీరీస్ గెల్చుకుంది.
- మార్చి 3, 2008
- పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని సముద్రతీరప్రాంత అడవులైన సుందర్‌బాన్స్‌ను పర్యాటక ప్రాంతంగా మార్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
- మేఘాలయా రాష్ట్ర శాసనసభ ఎన్నికలు సమాప్తం.
- రష్యా అధ్యక్ష ఎన్నికలలో ప్రస్తుత అధ్యక్షుడు పుతిన్ బలపర్చిన అభ్యర్థి దిమిత్రి మెద్వెదేవ్ విజయం.
- మార్చి 2, 2008
- కౌలాలంపూర్లో జరిగిన అండర్-19 ప్రపంచకప్ క్రికెట్ను భారత్ విజేతగా నిలిచింది. ఈ కప్‌ను భారత్ గెలవడం ఇది రెండో సారి.
- ఆస్ట్రేలియాలో జరుగుతున్న ముక్కోణపు క్రికెట్ టోర్నమెంట్‌లో మొదటి ఫైనల్‌లో భారత్ 6 వికెట్లతో విజయం సాధించింది. సచిన్ టెండుల్కర్ సెంచరీ సాధించి భారత విజయానికి దోహదపడి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు పొందినాడు.
- మార్చి 1, 2008
- ప్రపంచంలో పెద్దదైన ఎయిర్పోర్ట్ టెర్మినల్ చైనా రాజధాని బీజింగ్‌లో ప్రారంభమైనది. (యహూ తెలుగు)
- లిబర్హాన్ కమిషన్ గడుపును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ.
- ఐసిఐసిఐ బ్యాంకు న్యూయార్క్‌లో శాఖను ప్రారంభించింది.
- బంగ్లాదేశ్‌తో చిట్టగాంగ్‌లో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్లు మెంకంజీ, జి.సి.స్మిత్‌లు తొలి వికెట్టుకు 415 పరుగులు జోడించి కొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. దీనితో 52 సంవత్సరాల క్రితం భారత ఓపెనర్లు వినూ మన్కడ్, పంకజ్ రాయ్‌లు నెలకొల్పిన రికార్డు ఛేదించబడింది. (క్రిక్ఇన్ఫో)