గాట్ఫ్రైడ్ విల్హెమ్ (వాన్) లిబ్నిజ్ (/ laɪbnɪts /; [5] జర్మన్: [ɡɔtfʁiːt vɪlhɛlm fɔn laɪbnɪts] [లేదా] [laɪpnɪts]; [7] ఫ్రెంచ్: గోడ్ఫ్రోయ్ గిల్లాయ లీబ్నిట్జ్ ( 1646 జూలై 1 - 1716 నవంబరు 14 ) జర్మనీ దేశానికి చెండిన గణిత శాస్త్రవేత్త, తత్వవేత్త. సర్ ఇజాక్ న్యూటన్ సృష్టించిన కలన గణిత శాస్త్రాన్ని అభివృద్ధి చేశాడు. ఈయన 1685 లో ఒక పిన్వీల్ కాలిక్యులేటర్ను, లిబ్నిజ్ చక్రాన్ని కనిపెట్టాడు. ఇవి గణిత శాస్త్రంలో మొట్టమొదట ఉత్పత్తి చేసిన యాంత్రిక గణన యంత్రాలు. కంప్యూటర్ పరిజ్ఞానంలో బైనరి సంఖ్యను అభివృద్ధి చేశాడు.