హరిదాసు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హరిదాసు

హరిదాసు అనే పేరుతో మూడు వర్గాలలో ప్రసిద్దులు కలరు.నారదుడు మొదటి హరిదాసు అంటారు.

హరిదాసు  వేషధారణ చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూల హారం ధరించి చక్కగా తిలకం దిద్దుతాడు. తెలుగు రాష్ట్రాలలో పండులప్పుడు ముఖ్యంగా సంక్రాంతికి వీరికి విశేష ప్రాముఖ్యత ఉన్నది, హిందువుల నమ్మకం ప్రకారం హరిదాసు అనగా పరమాత్మతో సమానం మనుషులు ఇచ్చే దానధర్మాలు అందుకోని వారికి ఆయురారోగ్యాలు భోగభాగ్యలు కలగలని దివించెవారు హరిదాసులు . వీరు నెలరోజులు పాటు వీధి వీధినా హరినామన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయంపాకానికి అందరు ఇచ్చే ధన,ధాన్య , వస్తు దానాలను స్వికరిస్తారు[1] .   సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా బావిస్తారు .ధనుర్మాసం నెలరోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి, తిరుప్పావై పఠించి, అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు.   ఇంటికి తిరిగి వెళ్లే వరకు హరినామ సంకీర్తన తప్ప మరేమి మాట్లాడరు. అక్షయపాత్రను దించరు. ఇంటికి వెళ్ళాక ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి, అక్షయపాత్రను దించుతుంది.శ్రీకృష్ణునికి మరోరూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మలను ఇంటి ముందు చక్కగా అలంకరించి, హరినామ స్మరణ చేసే వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీమహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం  హరిదాసు పేద, ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. చిడతలు వాయిస్తూ, కీర్తనలు పాడుతూ, వాటికి అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రతి వాకిలికి వెళ్తారు. అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం , కూరగాయలు, డబ్బుల రూపంలో దానం చేస్తారు. హరిదాసును విష్ణు మూర్తికి సంకేతంగా భావిస్తారు. తల మీద ఉండే గిన్నెను భూమికి ప్రతీక అని చెప్తారు. లోకంలో ఉండే సుఖాలకు లొంగిపోయి దేవుడిని మర్చి-పోవద్దని హరిదాసు కీర్తనలు పాడతాడు. అలాగే ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా అందరూ సమానమని చాటిచెప్పే హరిదాసు కీర్తనల్లో, రూపంలో ఉంటుంది[2]. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమంటని కొంతమంది నమ్మకం అందుకే గ్రామాలో హరిదాసుడు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మలలో ధాన్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయపాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీమహా విష్ణువుకు కానుకగా బహుకరించినట్లుగా భక్తులు భావిస్తారు. హరిదాసు తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీమహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ప్రచారంలో ఉంది.కాలంతో పాటుగా హరిదాసులు వాహనాల మీదే తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. రికార్డు చేయించిన హరినామ కీర్తనలను మైక్‌ ద్వారా ప్రజలకు వినిపిస్తున్నారు.[3]

మొదటి వర్గం.

వీరు శ్రీహరి గాధల వ్యాప్తికి కృషి చేయుచూ హరికథ అనే ప్రక్రియ ద్వారా ప్రదర్శనలిచ్చుచూ ఉందురు.

రెండవ వర్గం.

కర్ణాటక ప్రాంతములో హరిదీక్ష తీసుకొని భజన, గానం, నృత్యాల ద్వారా హరి నామాన్ని వ్యాప్తి చేయువారు.

మూడవ వర్గం

వీరు హరినామ సంకీర్తన చేయుచూ కార్తీకమాసము, సంక్రాంతి సమయాల్లో గ్రామములలో బిక్షాటన చేయువారు.

మూలాలు

[మార్చు]
  1. "సంక్రాంతి: హరిదాసు.. అక్షయ పాత్ర బియ్యం పరమార్థం ఇదే". APHerald [Andhra Pradesh Herald]. Retrieved 2020-08-25.
  2. "అనుబంధాల కాంతి సంతోషాల.. సంక్రాంతి | | V6 Velugu" (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-01-15. Retrieved 2020-08-25.[permanent dead link]
  3. https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-696339[permanent dead link]
"https://te.wikipedia.org/w/index.php?title=హరిదాసు&oldid=4285600" నుండి వెలికితీశారు