హఫీజ్ సయీద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హఫీజ్ ముహమ్మద్ సయీద్
జననం. (1950-06-05) 1950 జూన్ 5 (వయసు 74)[1]
పంజాబ్,పాకిస్తాన్
మరణం29 నవంబర్ 2021
ప్రసిద్ధి2008 ముంబై దాడులు
పిల్లలుతల్హా సయీద్

హఫీజ్ ముహమ్మద్ సయీద్ (‬జననం 5 జూన్ 1950) పాకిస్తానీ తీవ్రవాది.[2][3][4] లష్కర్-ఇ-తోయిబా (లష్కరే) వ్యవస్థాపకుడు. ఈ ఉగ్ర సంస్థ ప్రధానంగా పాకిస్తాన్ నుండి పనిచేస్తోంది.[5][6][7]

ఏప్రిల్ 2012లో, యునైటెడ్ స్టేట్స్ లో166 మంది పౌరులను మరణానికి కారణం అయ్యాడు.2008 ముంబై దాడులలో సయీద్ పట్టించిన వారికి 10 మిలియన్[8] బహుమతిని ప్రకటించింది.అమెరికా చర్యకు భారత్‌ మద్దతివ్వగా, పాకిస్థాన్‌లో నిరసనలు వెల్లువెత్తాయి.[9][10][11]

సయీద్ NIA మోస్ట్ వాంటెడ్ లిస్ట్ UN నియమించబడిన ఉగ్రవాది జాబితాలో ఉన్నాడు. భారతదేశం,యునైటెడ్ స్టేట్స్,యునైటెడ్ కింగ్డమ్,యూరోపియన్ యూనియన్ పాటు ఆస్ట్రేలియా కూడా హఫీజ్ సయీద్ నిషేధించింది.[12][13]సయీద్ భారతదేశానికి అప్పగించాలని పలుమార్లు డిమాండ్ చేసింది. అయితే దీనికి పాకిస్తాన్ అంగీకరించలేదు.ప్రస్తుతం 11 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడు.[14]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

హఫీజ్ ముహమ్మద్ సయీద్ పంజాబ్,పాకిస్తాన్ లో జన్మించాడు.[15][16]అతని తండ్రి, మౌలానా కమల్-ఉద్-దిన్ గుజ్జర్ ఆయన మత బోధకుడు,భూస్వామి, రైతు.1947 భారతదేశ విభజన సమయంలో హర్యానా నుండి లాహోర్‌కు వలస వచ్చారు.[17]హఫీజ్ చిన్నతనంలో ఖురాన్‌ను కంఠస్థం చేసినందున అతనికి హఫీజ్ అని పేరు పెట్టారు.[18]1980ల ప్రారంభంలో ఉన్నత చదువుల కోసం సౌదీ అరేబియాకు వెళ్ళాడు.కింగ్ సౌద్ యూనివర్శిటీలో చదువుతున్న సమయంలో తన విద్యా ప్రదర్శనలకు బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. హఫీజ్ ముహమ్మద్ సయీద్ పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి రెండు మాస్టర్స్ డిగ్రీలు, కింగ్ సౌద్ విశ్వవిద్యాలయం నుండి ఇస్లామిక్ స్టడీస్ అరబిక్ భాషలో స్పెషలైజేషన్ పొందాడు.పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారుల సహాయంతో 1987లో జిహాదిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబాను స్థాపించాడు. లష్కర్ యొక్క ప్రాధమిక లక్ష్యం ఉంది భారతీయ కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్ పాకిస్తాన్ లో విలీనం చేయాలి అని ముఖ్య ఉద్దేశంతో ప్రారంభించారు.[19]2019లో తొలిసారి లాహోర్‌కు 50 కి.మీ.ల దూరంలోని గుజ్రాన్వాలా పట్టణంలో ‘ఉగ్రవాద నిరోధక’ పోలీసు విభాగం సయీద్‌ను అరెస్టు చేశారు. హఫీజ్ సయీద్‌కు రెండు కేసుల్లో ఐదున్నరేళ్ల జైలు శిక్ష విధిస్తూ లాహోర్‌లోని ఉగ్రవాద నిరోధక కోర్టు తీర్పు చెప్పింది.హఫీజ్ సయీద్‌ను ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్య సమితి, అమెరికా ప్రకటించాయి.అతడిని పట్టి ఇచ్చినవారికి 73 లక్షల రూపాయల రివార్డు కూడా అమెరికా ప్రకటించింది.2019 ఫిబ్రవరిలో కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక వాహన దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ లో కొన్ని మిలిటెంట్ సంస్థలపై పాకిస్తాన్ నిషేధం విధించింది. వీటిలో హఫీజ్ సయీద్‌కు చెందిన జేయూడీతోపాటుగా అతడు నడిపిస్తున్న ఫలాహ్-ఎ-ఇన్సానియత్ ఫౌండేషన్ కూడా ఉన్నాయి.

కుటుంబం

[మార్చు]

సయీద్ కుమారుడు తల్హా సయీద్ లష్కరే తోయిబా సెకండ్-ఇన్-కమాండ్‌గా పనిచేస్తున్నాడు. లష్కర్ ఆర్థిక వ్యవహారాలను బాధ్యతను తీసుకున్నాడు.2019లో, లాహోర్‌లో తల్హా సయీద్ బాంబు దాడి జరిగింది కానీ తప్పించుకున్నాడు.

చేయిన దాడులు

[మార్చు]
  • 13 డిసెంబర్ 2001 లోక్‌సభపై దాడిలో సయీద్ ప్రమేయం ఉందని భారత ప్రభుత్వం చేసిన ప్రకటన కారణంగా 21 డిసెంబర్ 2001న పాకిస్తాన్ సయీద్‌ను అదుపులోకి తీసుకుంది.
  • 11 జూలై 2006 ముంబై రైలు బాంబు దాడుల తరువాత పాకిస్తాన్ 9 ఆగస్టు 2006న అతన్ని అరెస్టు చేసి గృహనిర్బంధంలో ఉంచింది. అయితే లాహోర్ హైకోర్టు ఆదేశం తర్వాత 28 ఆగస్టు 2006న విడుదలయ్యాడు.

జాతీయ భాషగా పంజాబీ

[మార్చు]

పాకిస్తాన్ లో మెజారిటీ ప్రజలు పంజాబీ భాష మాట్లాడతారు. ఉర్దూను పాకిస్తానీయులలో 8% మంది మాత్రమే మాట్లాడతారు హఫీజ్ సయీద్ పంజాబీ భాష జాతీయ భాషగా చేయాలని ఆయన వాదించారు

మూలాలు

[మార్చు]
  1. "Wanted: Information that brings to justice Hafiz Saeed". Rewards for Justice (in ఇంగ్లీష్). Archived from the original on 25 April 2014. Retrieved 15 July 2018.
  2. "SECURITY COUNCIL AL-QAIDA AND TALIBAN SANCTIONS COMMITTEE ADDS NAMES OF FOUR INDIVIDUALS TO CONSOLIDATED LIST, AMENDS ENTRIES OF THREE ENTITIES". www.un.org (in ఇంగ్లీష్). 10 December 2008. Retrieved 15 July 2018.
  3. Shahzad, Asif (17 August 2017). "Charity run by Pakistani Islamist with $10 million bounty launches political party". Reuters (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 16 July 2018. Retrieved 16 July 2018.
  4. "US puts $10m bounty on Lashkar-e-Taiba's Hafiz Saeed". BBC News (in బ్రిటిష్ ఇంగ్లీష్). 3 April 2012. Archived from the original on 16 July 2018. Retrieved 16 July 2018.
  5. Mahmood, Amjad (7 December 2014). "Footprints: JuD's show of strength". Dawn.com. Archived from the original on 9 December 2014. Retrieved 16 July 2018.
  6. "Jamaat-ud-Dawah website-Organization". Archived from the original on 16 July 2018.
  7. Roggio, Bill (11 December 2008). "UN declares Jamaat-ud-Dawa a terrorist front group". The Long War Journal. Archived from the original on 17 December 2008.
  8. "U.S. puts $10 million bounty on Pakistan terror group's leader". The Washington Post.
  9. "India welcomes $10 million bounty on Hafiz Saeed". NDTV. 3 April 2012. Archived from the original on 1 August 2017. Retrieved 16 July 2018.
  10. "Thousands protest against US bounty on Hafiz Saeed". JAAG TV. CNBC Pakistan. 2 January 2015. Archived from the original on 2 January 2015. Retrieved 2 January 2015.
  11. "India will be forced to Kashmir just like US in Afghanistan: Hafiz Saeed". India Today. 13 January 2014. Archived from the original on 16 July 2018. Retrieved 16 July 2018.
  12. "National Investigation Agency Most Wanted". Government of India. Archived from the original on 26 January 2016. Retrieved 16 July 2018.
  13. India's most wanted. Vol. 19. Frontline. 2002. ISBN 0-06-621063-1. Retrieved 10 April 2012.
  14. USA redesignates Pakistan-based terror groups The Tribune
  15. "Noose tightens around Hafiz Saeed, LT and Jamaatud Daawa". Dailytimes.com.pk. 12 December 2008. Archived from the original on 16 April 2013. Retrieved 19 March 2010.
  16. Swami, Praveen (9 December 2008). "Pakistan and the Lashkar's jihad in India". The Hindu. Chennai, India. Archived from the original on 12 December 2008.
  17. Saeed, Hafiz (8 April 2012). "My Story". The Indian Express. The Indian Express [P] Ltd. Archived from the original on 15 July 2018. Retrieved 15 July 2018.
  18. Tariq Rahman, Interpretations of Jihad in South Asia: an Intellectual History, De Grutyer (2018), p. 215
  19. Roy, Arundhati (13 December 2008). "The Monster in the Mirror". The Guardian. London. Retrieved 1 November 2009.

వెలుపల లింకులు

[మార్చు]