వికీపీడియా:మమ్మల్ని కలవండి
వికీపీడియా లో వివిధ విషయాలకు సంబంధించి మమ్మల్ని కలవడం కొరకు అవసరమైన సమాచారం ఈ పేజీ లో లభిస్తుంది.
వ్యాస పాఠం
[మార్చు]కొత్త వ్యాసాలను సూచించడం, మొదలు పెట్టడం
[మార్చు]కొత్త వ్యాసం ఎవరైనా రాయవచ్చు. ముందుగా, దిద్దుబాటు యొక్క ప్రాధమిక అంశాలు తెలుసుకోవాలి. ఎటువంటి వ్యాసాలు రాయకూడదో కూడా తెలుసుకోవాలి. ఇవన్నీ తెలుసుకున్న తరువాత, కొత్త పేజీని ఎలా ప్రారంభించాలి తో కొత్త పేజీని మొదలు పెట్టవచ్చు. ఇంకా సహాయం కావాలంటే, వికీపీడియా పాఠం ఉండనే ఉంది.
వికీపీడియా కు ఒక కొత్త వ్యాస విషయాన్ని సూచించ దలస్తే, అభ్యర్ధించిన వ్యాసాలు పేజీ లో చెయ్యవచ్చు. ఆ పేజీ లో విషయ సూచిక ఉంది, మీ సూచనను అక్కడ చేర్చవచ్చు.
వ్యాసాలను సరిదిద్దటం, మెరుగు పరచడం
[మార్చు]వికీపీడియా వ్యాసాలను ఎవరైనా సరిదిద్దవచ్చు. పేజీ లో తప్పు గమనిస్తే ఆ పేజీ కి పైన ఉన్న మార్చు లింకును నొక్కండి. అప్పుడు వచ్చే దిద్దుబాటు పేజీ లోని టెక్స్ట్ బాక్స్ లో తప్పును సరిదిద్దండి. దిద్దుబాట్లు చేసేటపుడు,దిద్దుబాటు సారాంశం ను కూడా జత చేయండి. దిద్దుబాటు పై సహాయం కావాలంటే, వికీపీడియా పాఠం చదవండి.
వ్యాసాన్ని మెరుగు పరచడం పై చర్చించడానికి చర్చా పేజీకి వెళ్ళ్ళండి. వ్యాసం పేజీ కి వెళ్ళి, అక్కడ "చర్చ" ను నొక్కితే చర్చా పేజీ కి వెళ్ళవచ్చు. సభ్యులతో విడిగా మాట్లాడాలంటే, వారి చర్చా పేజీ కి వెళ్ళాలి. సభ్యుని పేరును నొక్కితే, సదరు సభ్యుని పేజీ కి వెళ్తారు, అక్కడ "చర్చ" నొక్కితే, ఆ సభ్యుని చర్చా పేజీ కి వెళ్తారు. అక్కడ మీరు చేసే మార్పు చేర్పులు, ఆ సభ్యుడు లాగిన్ కాగానే కనిపిస్తాయి.
దుశ్చర్య (విఛ్ఛిత్తి లేదా విఛ్ఛిన్నకర చర్య)
[మార్చు]వికీపీడియా లో ఎవరైనా రాయవచ్చు కాబట్టి, ఇక్కడ దుశ్చర్యలు జరగటం సహజమే. వికీపీడియా లో దుశ్చర్య అంటే, వ్యాసాన్ని చెడగొట్టే ఉద్దేశ్యంతో పనికిరాని చెత్తను పేజీల్లో పెట్టడం. మీరు ఏ పేజీ లో నైనా దుశ్చర్య ను గమనిస్తే ఈ సూచనలను పాటించి, వ్యాసాన్ని పూర్వపు కూర్పుకు తీసుకొని పోవచ్చు. తరువాత కూడా ఆ సభ్యుడు అటువంటి దుశ్చర్యలు చేస్తూ ఉంటే, ఇతర సభ్యులను ఈ విషయమ్పై అప్రమత్తం చెయ్యండి. దీని కొరకు మీరు ఈ పేజీ లను చూడండి:దుశ్చర్య జరుగుతూనే ఉంది దుశ్చర్య పై నిర్వాహకుని జోక్యం
అప్పుడు, అవసరమైతే, వికీపీడియా నిర్వాహకుడు ఆ దుష్టుని IP address, సభ్యత్వాన్ని నిషేధించుతారు.
పేజీ ల తొలగింపు, పునరుజ్జీవం
[మార్చు]ఒక పేజీ ని పూర్తిగా తొలగించవలసి ఉందని మీరు భావిస్తే, పైగా అది వికీపీడియా తొలగింపు విధానానికి అనుగుణంగా ఉందని అనుకుంటే, తొలగింపుకై వోట్లు పేజీ లో ప్రతిపాదించండి. ఆ పేజీలో, అడుగున, తొలగింపు కొరకు ఎలా ప్రతిపాదించాలో వివరణ ఉంది. ఏదైనా పేజీని అన్యాయంగా తొలగించారని మీరు భావిస్తే, తొలగింపుకు వ్యతిరేకంగా వోట్లు లో మీ వాదనను వినిపించండి.
వికీపీడియా సభ్యులు
[మార్చు]వికీపీడియా సభ్యుని గురించి తెలుసుకోవడానికి, ఆ సభ్యుని పేరును నొక్కండి; వారి సభ్యుని పేజీ కి వెళ్తారు. ఏ సభ్యుని తోనైనా చర్చించాలంటే, ఆ సబ్యుని పేజీలో చర్చ ను నొక్కండి. కొంతమంది సభ్యులు వికీపీడియా ద్వారా ఈ-మెయిల్స్ ను అనుమతిస్తారు. అటువంటి సభ్యుని పేజీ లో, తెరకు ఎడమ అడుగు భాగంలో "E-mail this user" అనే లింకు కనిపిస్తుంది. కొంత మంది సభ్యులు ఇంకొంత సమాచారం కూడా (ఈ-మెయిల్, తక్షణ సందేశం, ఫోను మొదలైనవి) తమ పేజీలో ఇస్తారు.
చాలా మంది సభ్యులను ఒకేసారి సంప్రదించాలనుకుంటే, మీరు మెయిలింగు జాబితా లలో సభ్యత్వం తీసుకుని అక్కడ సందేశం ఇవ్వవచ్చు, లేదా రచ్చబండ వద్ద చర్చించవచ్చు. సందేశాల సంగ్రహం నుండి పాత సందేశాలను చూడవచ్చు కూడా.
వికీపీడియా గురించి సాధారణ ప్రశ్నలు
[మార్చు]వికీపీడియా గురించిన సమాచారం కొరకు వికీపీడియా లో తరచూ అడిగే ప్రశ్నలు ఒక మంచి వనరు. ప్రతీ పేజీ కి (వ్యాసం పేజీలు, విధాన పేజీలు, సభ్యుని పేజీలు) కూడా దాని చర్చా పేజీ ఉంది. ఒక విషయానికి లేదా సభ్యునికి సంబంధించిన సమాచారం కొరకు, ఈ చర్చా పేజీయే సరియైన స్థానం.
ఇది కాకుండా, సాధారణ ప్రశ్నలకు 4 ప్రదేశాలు ఉన్నాయి:
- పేరుకు తగినట్టే రచ్చబండ సముదాయానికంతటికీ ఒక సమావేశ స్థలం. ప్రశ్నలకు, చర్చలకు, సిధ్ధాంత ప్రతిపాదనలకు, ప్రణాళికలకు, ఇంకా ఎన్నిటికో ఇది ఒక స్థావరం. మీకు ఏమైనా సందేహాలుంటే, ముందు రచ్చబండ వద్ద పెట్టండి; రచ్చబండ కు సంబంధించని ప్రశ్నలను తీసివేసి, సరైన చోట పెట్టి, అక్కడికి దారి కూడా చూప్స్తారు.
- వికీపీడియా ఆకృతీ, అమరికల గురించిన ప్రశ్నలకు, ముఖ్యంగా "ఎలా", "ఎందుకు", "అలా ఎందుకు చేయాలి" వంటి ప్రశ్నల సమాధానాలకై సహాయ కేంద్రం చూడండి.
- ఏదైనా విషయంపై వికీపీడియా సముదాయాన్ని అడిగి తెలుసుకోవాలంటే సంప్రదింపుల కేంద్రం చూడండి. ఒక గ్రంధాలయం లాగా ఇక్కడి ఔత్సాహికులు మీ ప్రశ్నలకు సమాధానా లివ్వడమే గాక ఆ విషయంపై చక్కని సమాచార వనరులను కూడా మీకు సూచిస్తారు. (ఒక్క మాట!, మీ హోమ్ వర్కు చెయ్యటానికి మమ్మల్ని వాడుకోవద్దు సుమా!!).
- వికీపీడియాను ఎలా మెరుగు పరచాలనే విషయంపై చర్చకు సాధారణ ఫిర్యాదులు చూడండి.
పై స్థలాల్లో మీ ప్రశ్నను అడిగిన తరువత కొన్ని రోజుల పాటు, క్రమం తప్పకుండా ఆ పేజీని సమాధానాల కొరకు చూస్తూండండి.
వికీమీడియా ఫౌండేషన్ కూ సంనంధించిన వివరాలకై (వాటి కొరకు మాత్రమే) [email protected] కు ఈ-మెయిల్ చెయ్యండి.
పత్రికా విచారణలు
[మార్చు]విలేకరులు మరియు ఇతర ఆసక్తి పరులు మెయిలింగు జాబితాకు ఈ-మెయిల్ పంపవచ్చు. మీరు ఈ జాబితాలో సభ్యులు కాకపోతే మీ ఈ-మెయిల్ ను నిర్వాహకుడు అనుమతించవలసి ఉంటుంది. మీరు చాలా ఈ-మెయిల్ లు పంపాలనుకుంటే సభ్యత్వ వివరాల కొరకు మెయిలింగు జాబితా ను చూడండి.
వికీపీడియన్లను సంప్రదించదలిస్తే, వికీపీడియన్లు మరియు నిర్వాహకుల జాబితా లను చూడండి.
మీకు పత్రికా సమాచార సేకరణ అవసరమైతే, పైగా మీరు విలేకరి అయితేనే , మీరు టెర్రీ ఫూట్ ను +1 727 231 0101 లో సంప్రదిస్తే ఆయన మిమ్మల్ని జిమ్మీ వేల్స్ కు కలుపుతారు. లేదా మీరు జిమ్మీ కి సరాసరి వికీ.చొమ వద్ద ఈ-మెయిల్ పంపవచ్చు. ఆ ఫోనును కేవలం పత్రికా విచారణలకే వాడండి. వేరే వటికి దానిని వాడ రాదు.
వికీమీడియా ఫౌండేషన్ పత్రికా అధికారి వివరాలకై meta: Press Officer చూడండి.
విధానం
[మార్చు]వికీపీడియా విధానాల పై చర్చ మెయిలింగు జాబితా వద్ద చెయ్యవచ్చు.
దిద్దుబాట్ల నుండి నిషేధం
[మార్చు]కొన్నిసార్లు దుశ్చర్యల కారణంగా IP address ను నిషేధించ వలసి రావచ్చు (పైన చూడండి). అయితే, ఒక్కోసారి, వేరే వాళ్ళు కూడా అదే అడ్రసును వాడుతూ ఉండవచ్చు.
ఒకవేళ అదే మీరయితే, మీరు దిద్దుబాట్లు జరపబోయినపుడు ఎదురైన సందేశం లోని సూచనలను పాటించండి. లేదా నిర్వాహకుల జాబితా లోని నిర్వాహకులను సంప్రదించవచ్చు.(ఈ-మెయిల్ లింకు ఉన్న నిర్వాహకులకు ఈ-మెయిల్ పంపవచ్చు). లేదా మీ సభ్యుని చర్చా పేజీలో సందేశం పెట్టండి (సాధారణంగా మీ సభ్యుని చర్చా పేజీ పనిచేస్తూనే ఉంటుంది).
కాపీ హక్కు ప్రశ్నలు
[మార్చు]మీకు కాపీ హక్కు ఉన్న వ్యాసం మీ అనుమతి లేకుండా వికీపీడియా లో వాడితే వెంటనే తొలగించడానికి విగ్జ్నప్తి చెయ్యవచ్చు. మరింత సమాచారానికై Wikipedia:కాపిహక్కు చూడండి.
కాపీ హక్కుల అతిక్రమణ అని మీరు అనుమానిస్తే ఇక్కడ ఉన్న సూచనలను పాటించండి.
వికీపీడియా లోని వ్యాసాలను వాడుకోవడానికి అనుమతి కావాలా? (GNU ఫ్రీ డాక్యుమెంటేషన్ లైసెన్సు) ఇప్పటికే మీకా అనుమతి - వ్యాపార ప్రయోజనాల కోసం కూడా - ఇచ్చేసింది. అయితే, మీరు లైసెన్సు నిబంధనలను పాటించాలి. వివరాలకు కాపీహక్కులు చూడండి.