Jump to content

మహానంది

అక్షాంశ రేఖాంశాలు: 15°28′14″N 78°37′34″E / 15.47056°N 78.62611°E / 15.47056; 78.62611
వికీపీడియా నుండి
మహానంది
గ్రామం
పటం
మహానంది is located in ఆంధ్రప్రదేశ్
మహానంది
మహానంది
అక్షాంశ రేఖాంశాలు: 15°28′14″N 78°37′34″E / 15.47056°N 78.62611°E / 15.47056; 78.62611
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లానంద్యాల
మండలంమహానంది
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్518502

మహానంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నంద్యాల జిల్లా, మహానంది మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. ఇది మహానంది మండలానికి కేంద్రం.నల్లమల కొండలకు ఇది తూర్పున ఉంది. దాని చుట్టూ అడవులు ఉన్నాయి. మహానందికి 15 కిలోమీటర్ల పరిధిలో నవ నందులుగా పిలువబడే తొమ్మిది నంది పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. నవ నందులలో మహానంది ఒకటి. ఇక్కడ ఒక ముఖ్య పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందిన మహానందీశ్వర స్వామి ఆలయం ఉంది.[1]ఇది మహా శివుడు మహానంది రూపంలో వెలసిన పుణ్యక్షేత్రం. శివుని గొప్ప ఉత్సవంగా పేరొందిన మహా శివరాత్రిని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, లేదా మార్చిలో ఘనంగా ఇక్కడ ఉత్సవం జరుగుతుంది.ఈ పురాతన ఆలయం సా.శ. 7 శతాబ్దం నాటిది. 10వ శతాబ్దపు పలకల శాసనాలు ప్రకారం ఈ దేవాలయం అనేక సార్లు మరమ్మత్తులు జరిగినట్లుగా, పునర్నిర్మించబడినట్లు తెలుపుతున్నాయి.[2]


చేరుకునే మార్గాలు

[మార్చు]

నంద్యాల నుండి మహానంది సుమారు 21 కి.మీ. సమీప అంతర్జాతీయ విమానాశ్రయం హైదరాబాద్‌లో ఉంది, ఇది దాదాపు 215 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమీప రైల్వే స్టేషన్ నంద్యాలలో ఉంది.[3] నంద్యాల పట్టణం నుండి మహానంది చేరుకోవడానికి 2 మార్గాలు ఉన్నాయి. తిమ్మాపురం మీదుగా ఒక మార్గం బస్టాండ్ నుండి 17 కి.మీ దూరంలో ఉన్న అతి చిన్న మార్గం.[3] మరొక మార్గం, గిద్దలూరు రోడ్డు మీదుగా బోయలకుంట్ల క్రాస్ వద్ద ఎడమవైపు నుండి వెళ్లే మార్గం. ఇది నంద్యాల నుండి 24 కి.మీ దూరంలో ఉంటుంది.


మూలాలు

[మార్చు]
  1. "Mahanandishwara Temple, Mahanandi - Timings, History, Pooja & Aarti schedule,". Trawell.in. Retrieved 2023-01-20.
  2. "Mahanandi Tourism | Tourist Places to Visit & Travel Guide to Mahanandi".
  3. "::.Ap Tourism.::". Archived from the original on 10 December 2016. Retrieved 15 July 2016.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=మహానంది&oldid=4268200" నుండి వెలికితీశారు