Jump to content

నైఋతి

వికీపీడియా నుండి
ఎనిమిది దిక్కుల సూచిక.

నైఋతి లేదా నిరృతి, అనగా పశ్చిమానికి దక్షిణానికి మధ్యసగం దక్షిణాన 45° (౪౫°) పడమర వైపు చూపించే దిశను అంటారు.[1]దీనిని నావికులు వాడే దిక్సూచిపై ఎటువంటి తేడాలేకుండా ఏ ప్రాంతంనైనా చూపిస్తుంది.దీనికి అధిపటి నివృత్తి అనే రాక్షసుడు. అధిపతి నిరృతి. అతని భార్య దీర్ఘాదేవి. ఇతని వాహనం గుఱ్ఱం. నివాసం కృష్టాంగన. ఆయుధం కుంతం.

వాస్తుశాస్త్రంలో నైరుతి దిశ

[మార్చు]

మీ భవనంలో నైరుతి అత్యధికంగా ఉంటే మీ ఆనందం, ఆత్మగౌరవం అత్యధికంగా ఉండటానికి అవకాశంఉందని కొంత మంది నమ్మతారు.అయితే ఇది వారి వారి నమ్మకంమీద ఆధారపడి ఉంటుంది.పూర్తిగా వాస్తవంకూడా కాకపోవచ్చు.మీ భవనంలో నైరుతి అత్యధికంగా ఉంటే ఆనందం ఆత్మగౌరవం అత్యధికంగా కలుగతాయని కొందరి నమ్మకం.[2]నైరుతి దిక్కు అన్ని దిక్కులకన్నా తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉంటే శుభం అని వాస్తుశాస్త్రంద్వారా తెలుస్తుంది.అలాగే ఈ దిక్కులో ఎక్కువగా బరువు ఉండడం శుభం జరుగుతుందని తెలుస్తుంది.ఈ దిక్కులో గోతులు, నూతులు ఉన్నట్లైతే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుందని నమ్మకం.

అనుకూలాలు

[మార్చు]

వాస్తుశాస్త్రం వ్రకారం,హిందూ పురాణాన ప్రకారం ఈ దిశ నిరృతి అనే ఒక రాక్షసుడి సొంతం అని హిందూ పురాణాల ప్రకారం తెలుస్తుంది. నైరుతికి సంబంధించిన గ్రహం రాహు.ఇది బలమైనది. ఈశాన్య దిక్కు నుండి ప్రవహించే అయస్కాంత శక్తులు ఈ దిక్కులో ప్రభావం చూపించితుంది. అందువలన ఇది బలమైన దిశఅని నమ్ముతారు. నైరుతి దిశ సరైన ఉపయోగం బలమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని మీకు ఇవ్వగలదు.విశ్వాసం, సంపద, ఆరోగ్యం, మీకు జీవితంలో పేరు, కీర్తిని ఇవ్వగలదు.[2] నైరుతి గదిలో నైరుతి మూల,తూర్పు లేక ఉత్తరంనకు ఎదురుగా ఉండునట్లు డబ్బులు దాచుకునే బీరువాలు, ఇనుప పెట్టెలు పెట్టుకుంటే మంచి ఫలితాలను ఇస్తుందని నమ్మకం.నైరుతి - పడమర మధ్యలో పిల్లల చదువులు, పెద్దలు మాట్లాడటానికి హాల్ మంచి సంభాషణలు అనుకూలం అని తెలుస్తుంది.[3]

ప్రతికూలాలు

[మార్చు]

ఇల్లు,ప్రాంతం నైరుతి వాస్తు ప్రకారం లేకపోతే కొన్ని సమస్యల కలగటానికి అవకాశం ఉంది.[2]

  • చెడు నైరుతి పరిస్థితులు చెత్తగా లేదా పాడుబడుటానికి దోహదపడవచ్చు.
  • ఆర్థిక ఇబ్బందులు ఏర్పడటానికి అవకాశం ఉంది.
  • చెడు ప్రవర్తనా సమస్యలను తెస్తుంది
  • నిరాశ, ఆందోళన, ఆత్మహత్య భావాలు మొదలైనవి కలగటానికి అవకాశం ఉంది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Southwest dictionary definition | southwest defined". www.yourdictionary.com. Retrieved 2020-08-05.
  2. 2.0 2.1 2.2 ttps://timesofindia.indiatimes.com/astrology/vastu-feng-shui/directions-its-importance-in-vastu/articleshow/68207048.cms
  3. https://telugu.oneindia.com/jyotishyam/feature/how-arrange-articles-the-house-217319.html

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=నైఋతి&oldid=4038175" నుండి వెలికితీశారు