నమలడం
నమలడం (Mastication or Chewing) జీర్ణ ప్రక్రియలో మొదటి భాగం.
నమిలేటప్పుడు ఆహార పదార్ధాలు పండ్ల మధ్యన పడి చిన్నవిగా చేయబడతాయి. అందువలన జీర్ణద్రవాలలోని ఎంజైమ్లు బాగా పనిచేసి ఆహారాన్ని సులభంగా జీర్ణించుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ ప్రక్రియలో నాలుక, బుగ్గలు సహకరిస్తాయి. నమలడం పూర్తయేసరికి ఆహారం మెత్తగా మారి లాలాజలంతో కలిసి ముద్దలాగా తయారౌతుంది. కార్బోహైడ్రేట్లు కొంతవరకు జీర్ణించబడతాయి. ఆ తర్వాత అన్నవాహిక ద్వారా జీర్ణకోశాన్ని చేరుకుంటుంది.
కొంతమంది తల్లిదండ్రులు చిన్న పిల్లలకు కొంత నమిలిన ఆహారాన్ని తినిపిస్తారు. దీనిని Premastication అంటారు. అందువలన పిల్లలు సులువుగా జీర్ణించుకోగలుగుతారు.[1]
జంతువులు
[మార్చు]నెమరువేయు జంతువులైన పశువులలో గడ్డి మొదలైన వాటిని రెండుసార్లు నములుతాయి. అదే మాంసాహార జంతువులు తమ ఆహారాన్ని పెద్ద పెద్ద కండలుగా ఒకేసారి నమలకుండా మింగేస్తాయి.
నమిలే కండరాలు
[మార్చు]ఈ క్రింది నమిలే కండరాలు (Muscles of Mastication) అన్ని జతగా ఉంటాయి.
- మాసెటర్ కండరం (Masseter muscle)
- టెంపొరాలిస్ కండరం (Temporalis muscle)
- మీడియల్ టెరిగాయిడ్ కండరం (Medial pterygoid muscle)
- లేటరల్ టెరొగాయిడ్ కండరం (Lateral pterygoid muscle)
యంత్రాలు
[మార్చు]ఇలాంటి నమిలే ప్రక్రియను కొన్ని యంత్రాలలో ప్రవేశపెట్టారు. అమెరికాలోని మాస్టికేటర్ అనే యంత్రం అగ్నిప్రమాదాలలో ఉపయోగించే యంత్రాన్ని ఉపయోగిస్తున్నది.[2]
మూలాలు
[మార్చు]- ↑ Holmes, Wendy (2007), "Influences on maternal and child nutrition in the highlands of the northern Lao PDR", Asia Pac J Clin Nutr, 16 (3): 537–545
- ↑ "Masticator shown and described at interagency Inciweb.org". Archived from the original on 2008-08-28. Retrieved 2011-09-03.