తెన్‌కాశి జిల్లా
తెన్కాశి జిల్లా Tenkasi District | |
---|---|
దేశం | భారతదేశం |
తమిళనాడు | తమిళనాడు |
అతిపెద్ద నగరం | తెన్కాశి |
స్థాపించబడింది | 2019 నవంబరు 22 |
Seat | తెన్‌కాశి |
విస్తీర్ణం | |
• Total | 2,916.13 కి.మీ2 (1,125.92 చ. మై) |
జనాభా | |
• Total | 14,07,627 |
• జనసాంద్రత | 480/కి.మీ2 (1,300/చ. మై.) |
భాషలు | |
• ప్రాంతం | తమిళం , మలయాళం |
Time zone | UTC+5:30 (IST) |
Vehicle registration | TN76 and TN76A and TN79 |
తెన్‌కాశి జిల్లా లేదా తెన్కాసి జిల్లా, తమిళనాడు రాష్ట్రం లోని జిల్లాల్లో ఇది ఒకటి. దీనిని 2019 నవంబరు 22న న తిరునల్వేలి జిల్లా నుండి వేరు చేసారు. తమిళనాడు ప్రభుత్వం దానిని 2019 జూలై 18న ప్రకటించింది. జిల్లా ప్రధాన కేంద్రం తెన్కాసి పట్టణం.
భౌగోళికం
[మార్చు]ఈ జిల్లా దక్షిణాన తిరునల్వేలి జిల్లా, ఉత్తరాన విరుదునగర్ జిల్లా, తూర్పున తూత్తుకుడి జిల్లా, పశ్చిమాన కేరళలోని కొల్లం పతనమిట్ట జిల్లాల సరిహద్దులతో ఉంది.
గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం, తెన్కాసి జిల్లా జనాభా 1,384,937. జనాభాలో షెడ్యూల్డ్ కులాల జనాభా 20.23% మంది ఉన్నారు. షెడ్యూల్డ్ తెగల జనాభా 0.25% ఉన్నారు. 42.75% మంది జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు.తమిళం ప్రధాన భాష. 2011 జనాభా లెక్కలు ప్రకారం జిల్లాలో 95% మంది తమిళం, 5% మంది మలయాళం మాట్లాడతారు.
పరిపాలన
[మార్చు]శివగిరి, శంకరన్‌కోవిల్, వీరకేరళంపుత్తూరు, అలంగుళం, తెన్‌కాసి షెంకోట్టై అనే 6 తాలూకాల నుండి తెన్‌కాశి ఏర్పడింది. ఆ తర్వాత మరో రెండు తాలూకాలు సృష్టించబడ్డాయి: కడయనల్లూరు, తిరువెంగడం.
రాజకీయాలు
[మార్చు]తెన్కాసి అసెంబ్లీ నియోజకవర్గం తెన్కాసి లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. తెన్కాసి తమిళనాడులోని లోక్‌సభ (భారత పార్లమెంటు) నియోజకవర్గం. ఈ సీటు వెనుకబడిన కులాలకు కేటాయించబడింది.
పార్లమెంటరీ నియోజకవర్గం
[మార్చు]వ.సంఖ్య | అసెంబ్లీ | నియోజకవర్గం | రిజర్వు చేసిన వివరాలు (ఎస్సీ / ఎస్టీ / ఏదీ లేదు) |
---|---|---|---|
1 | లోక్‌సభ | తెన్కాసి | ఎస్సీ |
తమిళనాడు అసెంబ్లీ నియోజకవర్గాలు
[మార్చు]వ.సంఖ్య | నియోజకవర్గ పేరు | రిజర్వు వివరాలు (ఎస్సీ / ఎస్టీ / ఏదీ లేదు) |
---|---|---|
1 | శంకరంకోవిల్ | ఎస్సీ |
2 | వాసుదేవనల్లూర్ | ఎస్సీ |
3 | కడయనల్లూర్ | ఏదీ లేదు |
4 | తెన్కాసి | ఏదీ లేదు |
5 | అలంగులం | ఏదీ లేదు |
మూలాలు
[మార్చు]- ↑ 8 தாலுகாக்களுடன் உதயமானது தென்காசி மாவட்டம். News7 Tamil. 22 November 2019. Retrieved 30 November 2019.
- ↑ "Census of India - Religion". census.gov.in.