జింద్
జింద్ | |
---|---|
Coordinates: 29°19′N 76°19′E / 29.317°N 76.317°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | హర్యాణా |
జిల్లా | జింద్ |
డివిజను | హిసార్ |
Named for | జయంతి దేవి పేరు మీదుగా |
Elevation | 227 మీ (745 అ.) |
జనాభా (2011) | |
• Total | 1,67,592 |
• జనసాంద్రత | 440/కి.మీ2 (1,100/చ. మై.) |
భాషలు | |
• అధికారిక | హిందీ |
Time zone | UTC+5:30 (IST) |
PIN | 126102 |
టెలిఫోన్ కోడ్ | 91-1681 |
ISO 3166 code | IN-HR |
Vehicle registration | HR-31, HR-56 (Commercial) |
హర్యానా రాష్ట్రం లోని పురాతన నగరాల్లో జింద్ ఒకటి. ఇది జింద్ జిల్లాకు ముఖ్య పట్టణం. పట్టణం లోని పర్యాటక ప్రాధాన్యత కలిగిన స్థలాల్లో రాణి తలాబ్ ఒకటి. పాండు -పిండారా, రామ్‌రాయ్‌లు మతపరమైన దర్శనీయ క్షేత్రాలు. అమావాస్య సమయంలో పవిత్ర స్నానం చేసేందుకు భక్తులు ఈ క్షేత్రాలకు వస్తూంటారు
జింద్ కోటను సా.శ. 1776 లో సిద్దూ జాట్ పాలకుడు మహారాజా గజ్‌పత్ సింగ్ నిర్మించాడు. నర్వానా, జులానా, ఉచనాలు జింద్ జిల్లాలో వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణాలు.
శబ్దవ్యుత్పత్తి
[మార్చు]మహాభారత యుద్ధానికి ముందు పాండవులు ఆరాధించిన జయంతుని (ఇంద్ర) పేరు మీద ఈ పట్టణానికి జయంతపుర అని పేరు పెట్టారు. పాండవులు జయంతి దేవి (విజయాల దేవత, ఇంద్రుని స్త్రీ రూపం) గౌరవార్థం జయంతి దేవి ఆలయాన్ని నిర్మించారని ప్రజల నమ్మకం. వారు విజయం కోసం ప్రార్థనలు చేసి, ఆపై కౌరవులతో యుద్ధం ప్రారంభించారు. ఆలయం చుట్టూ ఈ పట్టణాన్ని నిర్మించారు. దీనికి జయంతిపురి (జయంతి దేవి నివాసం) అని పేరు పెట్టారు. తరువాత దీనిని జింద్ అని మార్చారు. [1]
మహారాజా రంజీత్ సింగ్ చిన్నరాణి, దులీప్ సింగ్ తల్లి అయిన జింద్ కౌర్‌కు ఈ పట్టణం పేరే పెట్టారు. ఆమె ఇక్కడికి సమీపంలో ఉన్న ప్రాంతానికి చెందినదే.
చరిత్ర
[మార్చు]ఫూల్ సింగ్ మనవడు, ఫుల్కియన్ మిస్ల్ వ్యవస్థాపకుడు మహారాజా గజపత్ సింగ్, సిక్కు సాయుధ దళాలను సమకూర్చుకుని 1763 లో ఆఫ్ఘన్ గవర్నరు జైన్ ఖాన్ నుండి దేశంలోని పెద్ద భూభాగాన్ని స్వాధీనం చేసుకుని స్వతంత్ర సిక్కు రాజ్యాన్ని స్థాపించాడు. ప్రస్తుత జింద్ జిల్లా కూడా అందులో భాగమే. 1775 లో జింద్ ను తన రాజ్యానికి రాజధానిగా చేసుకున్నాడు. తరువాత రాజా సంగత్ సింగ్ (1822 నుండి 1834 వరకు పాలించాడు) జింద్ స్థానంలో సంగ్రూర్ను రాజధానిగా చేసుకున్నాడు. స్వాతంత్ర్యం తరువాత, జింద్ రాజ్యం భారత యూనియన్‌లో విలీనమైంది.
ఈ జిల్లా 1948 జూలై 15 న పెప్సు లోని సంగ్రూర్ జిల్లాలో భాగమైంది. 1966 నవంబరు 1 న, సంగ్రూర్ జిల్లాను రెండుగా విభజించి, జింద్ ముఖ్య పట్టణంగా జింద్ జిల్లాను ఏర్పాటు చేసారు. [1]
భౌగోళికం
[మార్చు]జింద్ 29°19′N 76°19′E / 29.32°N 76.32°E నిర్దేశాంకాల వద్ద, [2] సముద్రమట్టం నుండి 227 మీటర్ల ఎత్తున ఉంది.
జనాభా
[మార్చు]2011 జనగణన ప్రకారం [3] జింద్ నగర జనాభా 1,66,225. జనాభాలో పురుషులు 53.3%, మహిళలు 46.7%. జాతీయ సగటు 940 తో పోలిస్తే నగరంలో లింగ నిష్పత్తి 877. ఆరేళ్ల లోపు పిల్లల లింగ నిష్పత్తి 831. ఇది జాతీయ సగటు 918 కన్నా తక్కువ. జింద్ అక్షరాస్యత 74%, జాతీయ సగటు 64.3% కంటే ఇది ఎక్కువ. పురుషుల అక్షరాస్యత 80% కాగా, స్త్రీల అక్షరాస్యత 67%. 2011 లో జింద్ జనాభాలో ఆరేళ్ళ లోపు పిల్లలు 18,825 మంది. [4][5] హర్యాన్వీ, హిందీ, పంజాబీలు ఎక్కువగా మాట్లాడే భాషలు.
రోడ్లు, రైళ్ళు
[మార్చు]జింద్ జంక్షన్ రైల్వే స్టేషను, ఢిల్లీ - ఫాజిల్కా, రైలు మార్గం లోని రైల్వే కూడలి. నగరం గుండా వెళ్ళే ఇతర రైలు మార్గాలు జింద్-సఫిడాన్-పానిపట్, జింద్-గోహానా-పానిపట్ మార్గాలు. కొత్తగా రాబోయే రైలు మార్గం జింద్-నార్నాండ్- హన్సీ.
రోడ్డు మార్గాల ద్వారా కూడా జింద్‌కు ఇతర ప్రాంతాలతో చక్కటి రవాణా సౌకర్యాలున్నాయి. ప్రైవేటు యాజమాన్యంలోని బస్సులు జింద్ నుండి కైతల్, నార్వానా, పానిపట్, భివానీ, రోహ్‌తక్, సఫిడాన్, పుండ్రి లకు నడుస్తాయి నగరం నుండి దూర ప్రాంత బస్సు సర్వీసులు కూడా బయల్దేరుతాయి.
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 Haryana Samvad Archived 29 నవంబరు 2018 at the Wayback Machine, Oct 2018, p44-46.
- ↑ "Maps, Weather, Videos, and Airports for Jind, India". Fallingrain.com. Retrieved 19 October 2012.
- ↑ "View Population". Censusindia.gov.in. Retrieved 19 October 2012.
- ↑ "View Population". Censusindia.gov.in. Retrieved 19 October 2012.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.