Jump to content

ఉఖ్రుల్

అక్షాంశ రేఖాంశాలు: 25°07′00″N 94°22′00″E / 25.11667°N 94.36667°E / 25.11667; 94.36667
వికీపీడియా నుండి
ఉఖ్రుల్
పట్టణం
ఉఖ్రుల్ is located in Manipur
ఉఖ్రుల్
ఉఖ్రుల్
భారతదేశంలోని మణిపూర్ లో ప్రాంతం ఉనికి
ఉఖ్రుల్ is located in India
ఉఖ్రుల్
ఉఖ్రుల్
ఉఖ్రుల్ (India)
Coordinates: 25°07′00″N 94°22′00″E / 25.11667°N 94.36667°E / 25.11667; 94.36667
దేశం భారతదేశం
రాష్ట్రంమణిపూర్
జిల్లాఉఖ్రుల్
Elevation
1,662 మీ (5,453 అ.)
జనాభా
 (2011)[1]
 • Total27,187
భాషలు
 • అధికారికతంగ్ఖుల్ (నాగ)
Time zoneUTC+05:30 (భారత కాలమానం)
పిన్‌కోడ్
795142
Vehicle registrationఎంఎన్
స్త్రీ పురుష నిష్పత్తి1002 /

ఉఖ్రుల్ (హన్ఫున్), మణిపూర్ రాష్ట్రంలోని ఉఖ్రుల్ జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా పరిపాలనా ప్రధాన కార్యాలయం.[2]

భౌగోళికం

[మార్చు]

ఉఖ్రుల్ పట్టణం 25°07′N 94°22′E / 25.12°N 94.37°E / 25.12; 94.37 అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది.[3] ఇది సముద్రమట్టానికి 1,662 మీ. (5,453 అ.) ఎత్తులో ఉంది.

జనాభా

[మార్చు]
ఉఖ్రుల్ పట్టణం

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఉఖ్రుల్ పట్టణంలో 27,187 జనాభా ఉంది. ఇందులో 13,917 మంది పురుషులు, 13,270 మంది స్త్రీలు ఉన్నారు. ఈ జనాభాలో 3,363 (12.37%) మంది 0-6 సంవత్సరాల వయస్సు గలవారు ఉన్నారు. పట్టణ అక్షరాస్యత రేటు 88.92% కాగా, ఇది రాష్ట్ర సగటు 76.94% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 91.68% కాగా, మహిళా అక్షరాస్యత రేటు 86.04% గా ఉంది.[4]

ఇక్కడి జనాభాలో క్రైస్తవులు 89.65%, హిందువులు 8.76%, ముస్లింలు 0.81%, సిక్కులు 0.06%, బౌద్ధులు 0.52%, జైనులు 0.03%, ఇతరులు 0.17% ఉన్నారు.

పరిపాలన

[మార్చు]

ఈ పట్టణంలో 5,226 గృహాలు ఉన్నారు. పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, పరిశుభ్రత వంటి ప్రాథమిక సౌకర్యాలను అందజేయబడుతోంది. పట్టణ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా ఈ కమిటీకి అధికారం ఉంది.[4]

ఆర్థిక వ్యవస్థ

[మార్చు]

ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ఈ ప్రాంతంలో మెరుగైన విద్యుత్ సరఫరా లేదు. రవాణా, కమ్యూనికేషన్ వంటి మౌలిక సదుపాయాలు కూడా కనిష్టంగా ఉన్నాయి.

పర్యాటక ప్రాంతాలు

[మార్చు]

ఉఖ్రుల్ పట్టణంలో అందమైన లోయలు, కొండలు, జలపాతాలు, ప్రవాహాలు ఉన్నాయి.[5]

  1. ఖయాంగ్ కొండ
  2. శిరుయి కషుంగ్ కొండ
  3. కచౌఫుంగ్ సరస్సు
  4. ఖాంగ్ఖుయ్ గుహ
  5. శిరుయి కషుంగ్
  6. హుండుంగ్ మంగ్వా గుహ
  7. నిల్లై టీ ఎస్టేట్
  8. అంగో చింగ్

మూలాలు

[మార్చు]
  1. District Census Handbook: Ukhrul
  2. "Ukhrul Village in Ukhurl Central (Ukhrul) Manipur | villageinfo.in". villageinfo.in. Retrieved 2021-01-08.
  3. Falling Rain Genomics, Inc - Ukhrul
  4. 4.0 4.1 "Ukhrul Census Town City Population Census 2011-2021 | Manipur". www.census2011.co.in. Retrieved 2021-01-08.
  5. "Top 8 Places To Visit In Manipur". Trans India Travels. 2016-12-05. Retrieved 2021-01-08.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఉఖ్రుల్&oldid=3947352" నుండి వెలికితీశారు