ఆంటో ఆంటోనీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంటో ఆంటోనీ
ఆంటో ఆంటోనీ


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
31 మే 2009 (2009-05-31)
ముందు నియోజకవర్గం ఏర్పాటు చేశారు
నియోజకవర్గం పతనంతిట్ట

వ్యక్తిగత వివరాలు

జననం (1957-05-01) 1957 మే 1 (వయసు 67)
మూనిలవు , కేరళ , భారతదేశం
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు కురువిళ్ల ఆంటోని
చిన్నమ్మ ఆంటోని
జీవిత భాగస్వామి గ్రేస్ ఆంటో
సంతానం 2
నివాసం వడవత్తూర్, కొట్టాయం, కేరళ
నార్త్ అవెన్యూ, న్యూఢిల్లీ, ఢిల్లీ
పూర్వ విద్యార్థి సెయింట్ థామస్ కాలేజ్, పలై
కేరళ లా అకాడమీ, తిరువనంతపురం
ప్రభుత్వ న్యాయ కళాశాల, ఎర్నాకులం
రాజగిరి కాలేజ్ ఆఫ్ సోషల్ సైన్సెస్
వృత్తి రాజకీయ నాయకుడు

ఆంటో ఆంటోనీ పున్నతనియిల్ (జననం 1 మే 1957) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పతనంతిట్ట నుండి నాలుగుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

రాజకీయ జీవితం

[మార్చు]

ఆంటో ఆంటోనీ భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కొట్టాయం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి కె. సురేష్ కురుప్ చేతిలో 42,914 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పతనంతిట్ట నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి కె. అనంత గోపన్ పై 142,914 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఆంటో ఆంటోనీ 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పతనంతిట్ట నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పీలిపోస్ థామస్ పై 56,191 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి సీపీఐ(ఎం) అభ్యర్థి వీణా జార్జ్ పై 44,243 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

ఆంటో ఆంటోనీ 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పతనంతిట్ట నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి పీలిపోస్ థామస్ పై 66,119 ఓట్ల మెజారిటీతో గెలిచి నాలుగవసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

మూలాలు

[మార్చు]
  1. Times Now (14 April 2024). "Lok Sabha Elections 2024: Who Is Anto Antony? Three-Time MP Looking To Retain Pathanamthitta Seat" (in ఇంగ్లీష్). Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.
  2. The Hindu (4 June 2024). "UDF's Anto Antony retains Pathanamthitta by margin of 66,119 votes" (in Indian English). Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.
  3. TV9 Bharatvarsh (2024). "Anto Antony INC Candidate Election Result: केरल Anto Antony Pathanamthitta लोकसभा चुनाव 2024 परिणाम". Archived from the original on 3 August 2024. Retrieved 3 August 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)