అలీనగర్ ఒప్పందం
ఈస్టిండియా కంపెనీకి చెందిన రాబర్ట్ క్లైవ్, బెంగాల్ నవాబ్ మీర్జా ముహమ్మద్ సిరాజ్ ఉద్-దౌలా ల మధ్య 1757 ఫిబ్రవరి 9 న అలీనగర్ ఒప్పందం (కలకత్తా ఒప్పందం అని కూడా అంటారు) కుదిరింది.[1] అలీనగర్ అనేది, నవాబు కలకత్తాను స్వాధీనం చేసుకున్న తరువాత దానికి పెట్టిన పేరు. అయితే ఆ పేరు కొద్దికాలం పాటు మాత్రమే ఉంది. నవాబు కలకత్తాలోని ఇంగ్లీషువారి ఫోర్ట్ విలియమ్ కోటను స్వాధీనం చేసుకున్నాడు. అయితే వెనుక నుండి ఆఫ్ఘన్‌ల నుండి ఉన్న ముప్పు, ఎదుట ఆంగ్లేయుల సైనిక బలం ఎదుర్కోలేని నవాబు, ఆ ఒప్పందంపై సంతకం చేశాడు.[2]
ఒప్పందం నిబంధనల ప్రకారం నవాబు, 1717 లో మొఘల్ చక్రవర్తి ఫరూక్‌సియార్ ఇచ్చిన ఫర్మానాను గుర్తిస్తాడు. అంతేకాకుండా, బెంగాల్ గుండా వెళ్ళే అన్ని బ్రిటిషు వస్తువులకు సుంకాల నుండి మినహాయింపు ఉంటుంది. ఒప్పందం లోని ఇతర అంశాలలో, బ్రిటిషు వారు కలకత్తాలో స్థావరాన్ని బలోపేతం చేసుకునేందుకు, అలాగే కలకత్తాలో నాణేల ముద్రణనూ నవాబు అడ్డుకోరాదు.
ప్రఖ్యాత ప్లాసీ యుద్ధానికి ముందు జరిగిన సంఘటనలలో ఈ ఒప్పందం ఒకటి. అదే సంవత్సరం క్లైవ్, అతని మిత్రులు కలిసి నవాబును ఓడించి, చంపేసారు.
మూలాలు
[మార్చు]- ↑ "Advanced Study in the History of Modern India 1707-1813". Archived from the original on 27 June 2023. Retrieved 27 January 2024.
- ↑ "Treaty of Alinagar | Great Britain-India [1757]". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Archived from the original on 6 March 2021. Retrieved 2020-09-21.