బెండగింజల నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బెండకాయ మొక్క మాల్వేలిస్ వర్గము,మాల్వేసి కుటుంబానికి చెందినది.బెండవృక్షశాస్త్రనామము 'Abelmoschus esculentus'.ఇదిఏకవార్షిక మొక్క.0.9-2.0మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది.బెండకాయలను వంటకూరలలో వినియోగిస్తారు.

ఇతరభాషలలో బెండ పేరు

  • హింది,పంజాబు:భిండి(bhini)
  • గుజరాతి:భింద(bhinda)
  • బెంగాలి:ధెంరొషి(Dhenrosh)
  • కన్నడం:బెండెకాయి(Bende kayi)
  • తమిళం:బెండియ కాయై(Bendia kai)
  • ఒరియా:వెండి(vendi)
  • మలయాళం:వెండ(Venda)
  • అస్సాం,మరాఠీ:భేండి(Bhendi)

బెండ గింజలు

బెండ గింజలలో నూనెశాతం 1-17% వరకుండును.మాంసకృత్తులశాతం 18-19% వరకు మూడిపీచు(Crude Fibre)21% వుండును.గింజలలో నూనెశాతం తక్కువగా వుండటం వలన నూనెను ఎక్సుపెల్లరు యంత్రాలద్వారా దిగుబడి అనుకున్నంతగారాదు.అందుచే సాల్వెంట్ ప్లాంట్ ద్వారానే తియ్యాలి.

బెండగింజల నూనె భౌతికలక్షణాల పట్టిక

భౌతిక లక్షణాలు మితి
వక్రీభవన సూచిక 400Cవద్ద 1.4620 -1.4700
నూనె యొక్క ఐయోడిన్ విలువ 75-100
నూనె యొక్క సపొనిఫికేసను విలువ 192-200
నూనె లోని అన్ సపొనిఫియబుల్ మాటరు 1.5 గరిష్టం
ఆమ్ల విలువ 15.0గరిష్టం
నూనె విశిష్ణ గురుత్వము 30/300Cవద్ద 0.9160-.9190
రంగు 1/4" 35.0
హెల్పెన్ టెస్ట్ పాసిటివ్

బెండగింజలోని నూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం

ఫ్యాటి ఆమ్లాలు శాతం
మిరిస్టిక్ ఆమ్లం(C14:0) 0.2
పామిటిక్ ఆమ్లం(C16:0) 32.0
స్టియరిక్ ఆమ్లం(C18:0) 4-5
పామిటొలిక్ ఆమ్లం(C16:1) 0.4
ఒలిక్‌ ఆమ్లం(C18:1) 23-29
లినొలిక్ ఆమ్లం((C18:2) 34-39
సైక్లొప్రొపేన్ 2.0

నూనెఉపయోగాలు