బెండగింజల నూనె
బెండకాయ మొక్క మాల్వేలిస్ వర్గము,మాల్వేసి కుటుంబానికి చెందినది.బెండవృక్షశాస్త్రనామము 'Abelmoschus esculentus'.ఇదిఏకవార్షిక మొక్క.0.9-2.0మీటర్ల ఎత్తువరకు పెరుగుతుంది.బెండకాయలను వంటకూరలలో వినియోగిస్తారు.
ఇతరభాషలలో బెండ పేరు
- హింది,పంజాబు:భిండి(bhini)
- గుజరాతి:భింద(bhinda)
- బెంగాలి:ధెంరొషి(Dhenrosh)
- కన్నడం:బెండెకాయి(Bende kayi)
- తమిళం:బెండియ కాయై(Bendia kai)
- ఒరియా:వెండి(vendi)
- మలయాళం:వెండ(Venda)
- అస్సాం,మరాఠీ:భేండి(Bhendi)
బెండ గింజలు
బెండ గింజలలో నూనెశాతం 1-17% వరకుండును.మాంసకృత్తులశాతం 18-19% వరకు మూడిపీచు(Crude Fibre)21% వుండును.గింజలలో నూనెశాతం తక్కువగా వుండటం వలన నూనెను ఎక్సుపెల్లరు యంత్రాలద్వారా దిగుబడి అనుకున్నంతగారాదు.అందుచే సాల్వెంట్ ప్లాంట్ ద్వారానే తియ్యాలి.
బెండగింజల నూనె భౌతికలక్షణాల పట్టిక
భౌతిక లక్షణాలు | మితి |
వక్రీభవన సూచిక 400Cవద్ద | 1.4620 -1.4700 |
నూనె యొక్క ఐయోడిన్ విలువ | 75-100 |
నూనె యొక్క సపొనిఫికేసను విలువ | 192-200 |
నూనె లోని అన్ సపొనిఫియబుల్ మాటరు | 1.5 గరిష్టం |
ఆమ్ల విలువ | 15.0గరిష్టం |
నూనె విశిష్ణ గురుత్వము 30/300Cవద్ద | 0.9160-.9190 |
రంగు 1/4" | 35.0 |
హెల్పెన్ టెస్ట్ | పాసిటివ్ |
బెండగింజలోని నూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం
ఫ్యాటి ఆమ్లాలు | శాతం |
మిరిస్టిక్ ఆమ్లం(C14:0) | 0.2 |
పామిటిక్ ఆమ్లం(C16:0) | 32.0 |
స్టియరిక్ ఆమ్లం(C18:0) | 4-5 |
పామిటొలిక్ ఆమ్లం(C16:1) | 0.4 |
ఒలిక్ ఆమ్లం(C18:1) | 23-29 |
లినొలిక్ ఆమ్లం((C18:2) | 34-39 |
సైక్లొప్రొపేన్ | 2.0 |