Discover millions of ebooks, audiobooks, and so much more with a free trial

Only $9.99/month after trial. Cancel anytime.

Sri Skanda Puranam
Sri Skanda Puranam
Sri Skanda Puranam
Ebook258 pages1 hour

Sri Skanda Puranam

Rating: 0 out of 5 stars

()

Read preview

About this ebook

Dr.Jayanthi Chakravarthi Ph.D in Telugu is currently working as a Freelance Writer & Editor. He has done M.A.Telugu, M.A. Sanskrit, M.A. Archaeology, M.Phil. Archaeology, S.L.E.T. in Telugu and Sanskrit. He has written more than 75 on various subjects. He has worked as an editor for 4 years with Sri Kanaka Durga Prabha
LanguageTelugu
Release dateSep 21, 2020
ISBN6580304600726
Sri Skanda Puranam

Read more from Dr.Jayanthi Chakravarthi Ph.D.

Related to Sri Skanda Puranam

Related ebooks

Reviews for Sri Skanda Puranam

Rating: 0 out of 5 stars
0 ratings

0 ratings0 reviews

What did you think?

Tap to rate

Review must be at least 10 words

    Book preview

    Sri Skanda Puranam - Dr.Jayanthi Chakravarthi Ph.D.

    http://www.pustaka.co.in

    శ్రీ స్కాంద పురాణం

    Sri Skanda Puranam

    Author:

    జయంతి చక్రవర్తి

    Dr. Jayanthi Chakravarthi

    For more books

    http://www.pustaka.co.in/home/author/telugu/jayanthi-chakravarthi-novels

    Digital/Electronic Copyright © by Pustaka Digital Media Pvt. Ltd.

    All other copyright © by Author.

    All rights reserved. This book or any portion thereof may not be reproduced or used in any manner whatsoever without the express written permission of the publisher except for the use of brief quotations in a book review.

    భగవాన్ వేదవ్యాస మహర్షి రచించిన

    శ్రీ బ్రహ్మాండ పురాణం

    జిల్లెళ్ళమూడి అమ్మ

    మాతృశ్రీ అనసూయాదేవి ఆశీస్సులతో.

    వచనం : డాక్టర్ జయంతి చక్రవర్తి

    ఎం.ఏ., ఎం.ఫిల్., పిహెచ్.డి.,

    భగవాన్ వేదవ్యాస మహర్షి వ్యా

    సగుహ, సరస్వతీ తీరం, బదరీనాథ్

    అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరోహరిః |

    అఫాలలోచనః శంభుర్బగవాన్ బాదరాయణః ||

    కృతజ్ఞతలు

    అష్టాదశ పురాణాలని సామాన్య జనానికి అందించాలని సంకల్పించిన శ్రీ బాలాజీ పబ్లికేషన్స్ అధినేత శ్రీ పుట్టగుంట వీరయ్యచౌదరి (బోస్) గారికి ముందుగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

    ఈ గ్రంథాలకి తమ అమూల్యమైన ఆశీస్సులందించిన శ్రీ పీఠాధిపతులు పరమపూజ్య శ్రీశ్రీశ్రీ పరిపూర్ణానంద సరస్వతీ స్వామివారికి, అస్మద్గురువర్యులు ఆర్షవిద్యాసాగర బ్రహ్మశ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారికి సహస్రాధిక వందనాలు సమర్పిస్తున్నాను.

    ప్రోత్సహించిన మిత్రులు రోహిత్ ప్రింటర్స్ అధినేత శ్రీ పుప్పాల అప్పారావు గారికి, డా|| కానుకొల్లు బాలకృష్ణ, వలివేటి శివరామకృష్ణమూర్తి, వేదాంతం సార్వభౌమ, ఉన్నవ గణేష్ లకి...... అలాగే ఈ గ్రంథాన్ని డి.టి.పి. చేసిన శ్రీమతి వినీల గారికి పేజి మేకింగ్ చేసిన విద్యార్థి క్రియేషన్స్ వారికి ప్రత్యేక అభినందనలు...

    ఆశీస్సులు

    డా|| జయంతి చక్రవర్తి గారు అనేక ఆధ్యాత్మిక రచనల ద్వారా తెలుగు పాఠకులకు సుపరిచితులు. విజయవాడ కనకదుర్గ దేవస్థానం పక్షాన వెలువడుతున్న 'కనకదుర్గ ప్రభ' పత్రికకు ప్రారంభ సంపాదకులుగా ఆయన పేరు తెచ్చుకున్నారు. 'దశ మహావిద్యలు' పుస్తక రచన తరువాత డా|చక్రవర్తి గారు అష్టాదశ పురాణాలను తెలుగు పాఠక ప్రపంచంలోకి లోతుగా

    తీసుకువెళ్లాలని సంకల్పించారు. ఒక్కొక్క పురాణ సారాంశాన్ని ఒక్కొక్క చిన్న పుస్తకంగా విడుదల చేయాలన్న ఆ రచయిత సంకల్పం ప్రశంసనీయం.

    ఈ చిన్నిపొత్తాలు పాఠ కులందరికీ ప్రయోజనకరంగా, సదుపాయకరంగా ఉంటాయి. వీటి ఉపయోగాన్ని పాఠకులందరూ అందిపుచ్చుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

    జయ వత్సరం, శ్రావణ పూర్ణిమ

    (10.8.2014)

    తేది : 19-8-2014

    ఇది సృష్టి కథ

    అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష అనే వెక్కిరింపు లోకంలో బాగా ప్రచారంలో ఉంది. వెక్కిరించడానికి అన్నమాటే అయినా, ఇది నిజమని మాత్రం చెప్పక తప్పదు. వేదం సృష్టితత్త్వాన్ని, సృష్టికి మానవుడికి ఉన్న సంబంధాన్ని, మానవుడికి సృష్టికర్తతో గల అనుబంధాన్ని వ్యక్తం చేసింది. వేదం ఏ ఒక్కరో రచించిన గ్రంథం కాదు. సృష్టితత్త్వాన్ని, పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోవాలని ఆరాటపడిన మహర్షి సముదాయానికి అంతర్నేత్రానికి గోచరించిన ఒక దర్శనం. హృదయస్థానంలో వినిపించిన ఒక నాదం (శ్రుతి).వేదం 'అపౌరుషేయం' అని కూడా పెద్దలు గుర్తించారు. 'అపౌరుషేయం' అంటే మానవుమాత్రుడి రచన కాదు అని అర్ధం.

    అనాదిగా అలా దిగి వచ్చిన వేదం వ్యాసమహర్షి కాలానికి చిక్కువడిన దారాల రాశిగా ఉంటే, ఆ చిక్కును విడదీసి, వేదవిభాగ నిర్ణయంచేసి, వేదం మనకు అక్కరకు వచ్చేలా చేశాడు ఆ మహర్షి. ఆనాటి నుండి అతడికి 'వేదవ్యాసుడు' అనే పేరు వచ్చింది. సకల వేదాల సారాన్ని 555 సూత్రాలుగా బ్రహ్మసూత్రాలు రచించాడు. అయినా, ఆ మహర్షికి తృప్తి కలుగలేదు. వేదమనే విత్తనంలో నుంచి విశాలమైన పురాణ మహావృక్షాలను అంకురింప చేశాడు. అందుకే పురాణాలకు వేదోపబృంహణాలు అని పేరు. ఉపబృంహణం అంటే విత్తనాలు నుంచి మొలక రావడం. విత్తనంలో ఏమి ఉన్నదో మొలకలో, మొక్కలో, చెట్టులో అదే ఉంటుంది.

    వేద వాజ్మయంలో దాగిన సృష్టి తత్త్వాన్ని కథారూపంగా వివరించడానికి అష్టాదశ పురాణాలను రచించాడు వ్యాసమహర్షి. మానవాభ్యుదయం కోసం వెలువడిన ఈ పురాణ వాజ్మయసారాన్ని సంక్షిప్తంగా సంకలనం చేసి అందిస్తే, ఈనాటి సమాజానికి శ్రేయస్సు కలుగుతుందని సంకల్పించాడు మా శిష్య మిత్రుడు డా|| జయంతి చక్రవర్తి. తన ఓర్పు నేర్పులతో అష్టాదశ పురాణాల ఆంతర్యాన్ని వాడుకభాషలో నేటి జన సామాన్యానికి అందుబాటులోకి తెచ్చే పవిత్రమైన బాధ్యతను నెరవేర్చాడు.

    మంచి సాహిత్యాన్ని మన సమాజానికి అందించే మహత్తర లక్ష్యంతో శ్రీ బాలాజీ పబ్లికేషన్స్ వారు ఈ అష్టాదశ పురాణాలని ప్రచురించటానికి ముందుకు వచ్చారు. వీరిద్వారా ఇంకా ఎన్నో చక్కని గ్రంథాలు వెలుగు చూస్తున్నాయి.

    పురాణ వాజ్మయంలోని పుణ్యకథా విశేషాలను ఈనాటి సమాజానికి పంచే కృషిలో పాలు పంచుకుంటున్న మా చక్రవర్తి, సంప్రదాయ సాహిత్యాన్ని ప్రచురించే సత్కార్యాన్ని మహాయజ్ఞంగా స్వీకరించిన ప్రచురణకర్త శ్రీ బాలాజీ పబ్లికషన్స్ వారు ఎంతైనా అభినందనీయులు.

    వీరిద్దరికీ అంతర్యామి అనంత శుభాలనూ ప్రసాదించాలని ఆశీర్వదిస్తూ, ఈ గ్రంథాలు ప్రజలకు చేరువ కాగలవని ఆకాంక్షిస్తున్నాను.

    మల్లాపుగడ శ్రీమన్నారాయణమూర్తి

    పురాణ పురుషుడు శ్రీమన్నారాయణుడు

    విషయసూచి

    ఉపోద్ఘాతము

    అం.ఆ

    వక్రతుండ మహాకాయ కోటిసూర్య సమప్రభ |

    నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||

    వ్యాసం వశిష్ఠనప్తారం శక్తేః పౌత్ర మకల్మషమ్ |

    పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ||

    అష్టాదశ పురాణాలు

    మన భారతవాజ్మయంలో వేదాల తరువాత అంతటి ప్రాశస్త్యాన్ని పొందిన గ్రంథాలు పురాణాలు. వేదాల్లో చెప్పిన ధర్మాల్ని కథలరూపంలో, ఆఖ్యానాల రూపంలో సామాన్యులకు సైతం అర్థమయ్యేలా తెలియచెప్పేవే పురాణాలు. అందుకే పురాణాల్ని పంచమవేదంగా కీర్తించారు. అసలు పురాణం అంటే? పురా అపినవం-పురాతనమైనప్పటికీ నూతనంగా వుండేది అని అర్థం. అలాగే 'పురా ఆనతి' అంటే ప్రాచీనకాలంలో జరిగింది అని, వాయుపురాణం పురాణ శబ్దాన్ని నిర్వచిస్తే, 'పురాఏతత్ అభూత్' పూర్వం ఇలా జరిగింది అని బ్రహ్మాండ పురాణం పురాణ శబ్దానికి అర్థాన్ని చెబుతుంది. వీటన్నిటినీ క్రోడీకరించి చూస్తే పురాణం అంటే పూర్వకాలంలో జరిగిన ఎన్నో విషయాల్ని వివరించి చెప్పేది అని తెలుస్తోంది.

    పురాణాలు ఎన్ని

    పురాణాలు మహాపురాణాలు, ఉపపురాణాలని రెండు విధాలుగా వున్నాయి. మహాపురాణాలు 18, అలాగే ఉపపురాణాలు 18.

    బ్రహ్మం పాద్మం వైష్ణవం చ వాయవీయం తధైవచ |

    భాగవతం నారదదీయం మార్కండేయంచ కీర్తితమ్ ll

    ఆగ్నేయంచ భవిష్యంచ బ్రహ్మవైవర్త లింగకే |

    వారాహంచ తథా స్కాందం వామనం కూర్మ సంజ్ఞకమ్ |

    మాత్స్యం చ గారుడం తద్వదహ్మాండాఖ్యమితి త్రిషట్ ||

    1.బ్రహ్మపురాణం 2. పద్మపురాణం 3. విష్ణుపురాణం 4. వాయు పురాణం 5. భాగవత పురాణం 6.నారదపురాణం 7.మార్కండేయ పురాణం 8.అగ్నిపురాణం 9.భవిష్యపురాణం 10.బ్రహ్మవైవర్త పురాణం 1 1.లింగపురాణం 12. వరాహ పురాణం 13.స్కాంద పురాణం 14.వామన పురాణం 15.కూర్మ పురాణం 16.మత్స్య పురాణం 17.గరుడ పురాణం 18.బ్రహ్మాండ పురాణం - ఈ పద్దెనిమిదీ మహాపురాణాలు. అలాగే 18 ఉపపురాణాలు కూడా వున్నాయి. ఈ మహాపురాణాల పేర్లని గుర్తుంచుకోవటానికి శ్లోకం కూడా వుంది.

    'మ' ద్వయం 'భద్వయం చైవ 'బ్ర'త్రయం 'వ' చతుష్టయం |

    అనాపలింగ కూస్కాని పురాణాని పృథక్ పృథక్ II

    'మ' తో మొదలయ్యేవి రెండు 1.మత్స్య 2.మార్కండేయ

    'భ' తో మొదలయ్యేవి రెండు 1.భాగవత 2.భవిష్య

    'బ్ర' తో మొదలయ్యేవి మూడు 1.బ్రహ్మ 2.బ్రహ్మవైవర్త 3.బ్రహ్మాండ

    'వ' తో మొదలయ్యేవి నాలుగు 1.వాయు 2.విష్ణు 3.వామన 4.వరాహ

    అ-అగ్ని, నా-నారద, ప-పద్మ, లిం-లింగ, గ-గరుడ, కూ-కూర్మ, స్కా-స్కాంద ఇలా మొత్తం పద్దెనిమిది పురాణాలు.

    పురాణాలు విష్ణుస్వరూపం

    అష్టాదశ పురాణాలను సాక్షాత్తు విష్ణు స్వరూపంగా పోల్చారు. 18 పురాణాలని మహావిష్ణువు శరీరంలోని 18 అంగాలుగా భావిస్తారు మన ప్రాచీన ఋషులు.

    1. బ్రహ్మపురాణం - శ్రీ మహావిష్ణువు శిరస్సు

    2. పద్మపురాణం - శ్రీ మహావిష్ణువు హృదయం

    3. విష్ణుపురాణం - శ్రీ మహావిష్ణువు కుడిభుజం

    4. వాయుపురాణం - శ్రీ మహావిష్ణువు ఎడమభుజం

    5. భాగవత పురాణం - శ్రీ మహావిష్ణువు ఊరువులు

    6. నారదపురాణం - శ్రీ మహావిష్ణువు నాభి

    7. మార్కండేయపురాణం - శ్రీ మహావిష్ణువు కుడిపాదం

    8. అగ్నిపురాణం - శ్రీ మహావిష్ణువు ఎడమపాదం

    9. భవిష్యపురాణం - శ్రీ మహావిష్ణువు కుడిమోకాలు

    10. బ్రహ్మవైవర్తపురాణం - శ్రీ మహావిష్ణువు ఎడమమోకాలు

    11. లింగపురాణం - శ్రీ మహావిష్ణువు కుడి చీలమండ

    12. వరాహపురాణం - శ్రీ మహావిష్ణువు ఎడమ చీలమండ

    13. స్కందపురాణం - శ్రీ మహావిష్ణువు కేశాలు

    14. వామనపురాణం - శ్రీ మహావిష్ణువు చర్మం

    15. కూర్మపురాణం - శ్రీ మహావిష్ణువు పృష్ఠభాగం

    16. మత్స్యపురాణం - శ్రీ మహావిష్ణువు మెదడు

    17. గరుడపురాణం - శ్రీ మహావిష్ణువు మాంససారం

    18. బ్రహ్మాండపురాణం - శ్రీ మహావిష్ణువు ఎముకలు

    పురాణ లక్షణం :

    సర్గశ్చ ప్రతిసర్గశ్చ వంశోమన్వంత రాణి చ |

    వంశానుచరితం చేతి పురాణం పంచ లక్షణం ||

    పురాణానికి ఐదు లక్షణాలు ప్రధానంగా వుండాలని చెప్పారు. 1.సర్గ-అంటే ప్రపంచ సృష్టి, 2.ప్రతిసర్గ-ఈ ప్రపంచ ప్రళయం , 3.వంశం-రాజుల, ఋషుల, దేవతలకు సంబంధించిన వంశ విశేషాలు అవతారాలు 4.వంశానుచరితం-రాజవంశాలలో, ఋషుల వంశాలలో పుట్టిన వారి జీవితచరిత్రలు, 5.మన్వంతరాలు-మనువులు, మనువు ద్వారా ఏర్పడ్డ సంతతి, ఆయా మన్వంతరాలలో జరిగిన విశేషాలు. ఈ విధంగా ప్రతిపురాణం పంచలక్షణాలతో

    Enjoying the preview?
    Page 1 of 1