Jump to content

పరమాణు సంఖ్య

వికీపీడియా నుండి
(Atomic number నుండి దారిమార్పు చెందింది)
బోర్ నమూనా సృష్టికర్త నీల్స్ బోర్

పరమాణువు అన్నా అణువు అన్నా తెలుగు వాడుకలో తేడా లేదు. రెండూ ఇంగ్లీషు లోని atom అనే మాటకి సమానార్థకాలుగా వాడుతున్నారు. నిజానికి పరమాణువు అనే మాటని అణువులో అంతర్భాగాలైన ఎలక్ట్రానులు, ప్రోటానులు, నూట్రానులు.

'"పరమాణు సంఖ్య"' అనగా 'పరమాణు కేంద్రకంలోని ప్రోటాన్ల సంఖ్య ' లేక ' తటస్థ పరమాణువులోని ఎలక్ట్రాన్ల సంఖ్య '. దీనిని Z అనే అక్షరంలతో సూచిస్తారు. ఈ అక్షరం జర్మన్ పదం Atomzahl (పరమాణు సంఖ్య లేదా అణు సంఖ్య) నుండి వచ్చింది.

ఉదాహరణలు

[మార్చు]
  • హైడ్రోజన్ పరమాణు కేంద్రకంలో ఒక ప్రోటాన్ ఉంటుంది. అందువలన హైడ్రోజన్ పరమాణు సంఖ్య=1.
  • సోడియం పరమాణు కేంద్రకంలో 11 ప్రోటాన్లు ఉంటాయి. అందువలన దాని పరమాణు సంఖ్య=11.

ఈ సందర్భంలో గరిమ సంఖ్య అనే మరొక భావం ఉంది. దీనిని ఇంగ్లీషులో మాస్ నంబర్ (mass number) అని అంటారు. ఒక మూలకం యొక్క కేంద్రకంలో ఉన్న ప్రోటానులు, నూట్రానులు మొత్తం లెక్కని గరిమ సంఖ్య అంటారు. రెండు మూలకాలలో ప్రోటానుల సంఖ్య ఒకటిగానే ఉండి నూట్రానుల సంఖ్య వేరువేరుగా ఉంటే వాటిని ఆవర్తన పట్టికలో ఒకే గదిలో అమర్చాలి. అందుకని ఆ జాతి మూలకాలని సమస్థానులు (ఐసోటోపులు) అంటారు.

చరిత్ర

[మార్చు]

నవీన ఆవర్తన పట్టికలో మూలకాలు క్రమం పరమాణు సంఖ్య ఆధారంగా అమరి ఉన్నాయి. అనగా పరమాణు సంఖ్య ఆవర్తన పట్టికకు ఒక క్రమాన్ని నిర్దేశించింది.అవర్తన పట్టికలో మూలకాల పరమాణు సంఖ్యల ఆధారంగా ఎలక్ట్రాన్ విన్యాసంలో వేలన్సీ ఎలక్ట్రాన్ విన్యాసం అనుసరించి గ్రూపులు అమరి ఉంటాయి.మెండలీఫ్ ఆవర్తన నియమం ప్రకారం మూలకాల ధర్మాలు పరమాణు భారాల ఆవర్తన ప్రమేయాలు. దీని ప్రకారం ఆవర్తన పట్టికలో అయొడిన్ మూలకం (పరమాణు భారం127.6) తర్వాత టెల్లూరియం (పరమాణు భారం 127.6) ఉండాలి. కాని ధర్మాల ఆధారంగా ఈ నియమాన్ని అతిక్రమించి అయొడిన్ మూలకం ముందు టెల్లూరియం మూలకాన్ని అమర్చాడు.ఈ అమరిక పరమాణు సంఖ్య ఆధారంగా ఉన్నది అని తెలియుచున్నది.ఆవర్తన పట్టికలో మూలకాల భారాల ఆధారంగా అమరిక సంతృప్తి కరంగా లేదని గమనించారు. అదే విధంగా టెల్లూరియం తర్వాత మూలకాలైన ఆర్గాన్, పొటాషియం, కోబాల్ట్, నికెల్ జంటలు కూడా పరమాణు భారాల ఆధారంగా అమర్చినపుడు వాటి లక్షణాలలో లోపం కనిపించింది. వాటి రసాయన లక్షణాల ఆధారంగా అమరిస్తే పరమాణు భారాలు ఒకెలా ఉన్నాయి లేదా తారుమారు అయినాయి. అదే విధంగా ఆవర్తన పట్టికలో దిగువన గల లాంధనైడ్లలో కూడా లుటేషియం నుండి అన్ని మూలకాలు పరమాణు భార క్రమంలో అమరిస్తే అనేక అసంగతాలకు దారి తీస్తున్నాయి. అందువల్ల మూలకాల ధర్మాలకు ఆవర్తన ప్రమేయాలుగా ఒక నిర్ధిష్ట సంఖ్య అవసరమై యున్నది. ఆ సంఖ్యయే పరమాణు సంఖ్య.

ఇవి కూడా చూడండి

[మార్చు]