Jump to content

1709

వికీపీడియా నుండి

1709 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1706 1707 1708 - 1709 - 1710 1711 1712
దశాబ్దాలు: 1680లు 1690లు - 1700లు - 1710లు 1720లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

[మార్చు]
ఉక్రెయిన్ లో పోల్టావా యుద్ధం
  • జనవరి 1: సెయింట్ జాన్స్ యుద్ధం. దీనిలో బ్రిటిష్ కాలనీ న్యూఫౌండ్లాండ్ రాజధాని సెయింట్ జాన్స్‌ను ఫ్రెంచివారు స్వాధీనం చేసుకున్నారు.
  • జనవరి 6: పశ్చిమ ఐరోపాలో 1709 నాటి గ్రేట్ ఫ్రాస్ట్. 500 సంవత్సరాలలో అత్యంత శీతల కాలం ఏర్పడింది. ఇది ఆ నాటి రాత్రి వేళ మొదలైంది. మూడు నెలల పాటు కొనసాగింది. దీని ప్రభావం మొత్తం ఏడాదంతా ఉంది. [1] ఫ్రాన్స్‌లో, అట్లాంటిక్ తీరం, సీన్ నది గడ్డకట్టాయి. పంటలు దెబ్బతిన్నాయి. 24,000 పారిసియన్లు మరణించారు. తేలియాడే మంచు ఉత్తర సముద్రంలోకి ప్రవేశించింది.
  • జనవరి 10: అబ్రహం డర్బీ I, ఇంగ్లాండ్‌లోని ష్రాప్‌షైర్‌లోని తన కోల్‌బ్రూక్‌డేల్ బ్లాస్ట్‌ ఫర్నేస్‌లో కోక్ ఇంధనాన్ని ఉపయోగించి పోత ఇనుమును విజయవంతంగా ఉత్పత్తి చేశాడు. [2] [3] [4]
  • మార్చి 28: ఐరోపా‌లో మొదటిసారిగా డ్రెస్డెన్‌లో హార్డ్-పేస్ట్ పింగాణీని ఉత్పత్తి చేసినట్లు జోహాన్ ఫ్రెడరిక్ బాట్గర్ చెప్పాడు.
  • ఏప్రిల్: మిర్వైస్ హోటాక్, కాందహార్‌ను పెర్షియన్ గవర్నరు నుండి చేజిక్కించుకున్నాడు.
  • జూలై 8: గ్రేట్ నార్తర్న్ వార్ : కోసాక్ హెట్‌మనేట్ ( ఉక్రెయిన్ ) లో పోల్టావా యుద్ధం - రష్యా చక్రవర్తి పీటర్ ది గ్రేట్, చార్లెస్ ఆధ్వర్యంలోని స్వీడన్ దళాలపై నిర్ణయాత్మక విజయం సాధించి రష్యా దండయాత్రను ముగించాడు. దీంతో ఐరోపాలో ఓ ప్రధాన శక్తిగా స్వీడన్ పాత్ర ముగిసింది.

మరణాలు

[మార్చు]
  • సర్వాయి పాపన్న గెరిల్లా సైన్యాన్ని తయారు చేసి, ఆ సైన్యం ద్వారా మొగలు సైన్యంపై దాడి చేసినవాడు. (జ.1650)
  • మే 24: డేనియల్ గాబ్రియల్ ఫారెన్‌హీట్ ఆల్కహాల్ థర్మామీటర్ ను కనుగొన్నాడు. (జ.1686).

పురస్కారాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Pain, Stephanie. "1709: The year that Europe froze." New Scientist, 7 February 2009.
  2. Mott, R. A. (5 January 1957). "The earliest use of coke for ironmaking". The Gas World, coking section supplement. 145: 7–18.
  3. Raistrick, Arthur (1953). Dynasty of Ironfounders: the Darbys and Coalbrookdale. London: Longmans, Green. p. 34.
  4. Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. p. 292. ISBN 0-304-35730-8.
  5. "The History of Umbrellas". Oakthrift Corporation. Archived from the original on 2013-09-02. Retrieved 2011-12-22.
"https://te.wikipedia.org/w/index.php?title=1709&oldid=3864811" నుండి వెలికితీశారు