Jump to content

బాదామి

వికీపీడియా నుండి
బాదామి
వాతాపి
నగరం
బాదామి గుహ ఆలయాలు
Country India
రాష్ట్రముకర్ణాటక
జిల్లాబాగల్‌కోట్ జిల్లా
విస్తీర్ణం
 • Total10.9 కి.మీ2 (4.2 చ. మై)
Elevation
586 మీ (1,923 అ.)
జనాభా
 (2001)
 • Total25,851
 • జనసాంద్రత2,400/కి.మీ2 (6,100/చ. మై.)
Languages
 • Officialకన్నడ
Time zoneUTC+5:30 (IST)
పిన్‌కోడ్
587 201
Telephone code08357

బాదామి లేదా వాతాపి కర్ణాటక రాష్ట్రం లోని బాగల్‌కోట్ జిల్లా లోని ఒక పట్టణం, అదే పేరు గల తాలూకా కేంద్రము. ఈ పట్టణం క్రీస్తు శకం 540 నుండి 757 వరకు బాదామి చాళుక్యుల రాజధానిగా ఉండేది.

ప్రకృతి

[మార్చు]

బాదామి, దాని పరిసరాలు అతి సుందరమైన ప్రకృతి దృశ్యాలకు నెలవులు. ఈ కారణం చేత ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల నుండి ఇక్కడికి యాత్రికులు వస్తారు. పలు సినిమాలు కూడా ఇక్కడ చిత్రీకరించబడ్డాయి. ఇక్కడ రుతువులు ఇలా ఉంటాయి.

  • వేసవి కాలము- మార్చి నుండి జూన్ వరకు
  • వసంత కాలము- జనవరి నుండి మార్చి వరకు
  • వర్షాకాలము- జూలై నుండి అక్టోబరు వరకు
  • శీతాకాలము - నవంబరు నుండి జనవరి వరకు.

వేసవిలో ఉష్ణోగ్రత కనీసము 23 డిగ్రీల నుండి గరిష్ఠము 45 డిగ్రీల వరకు ఉంటుంది. అదే శీతాకాలంలో 15 నుండి 29 డిగ్రీల వరకు ఉంటుంది. వర్షపాతము ఏడాదికి 50 సెంటీమీటర్లు ఉంటుంది. నవంబరు నుండి మార్చి వరకు పర్యటనలకు మిక్కిలి అనువైన కాలము. ఇక్కడి వాతావరణం కోతులకు మిక్కిలి అనువైనది. కావున వీటి సంతతి ఇక్కడ బాగా అభివృద్ధి చెందింది. పర్యాటకులు వీటిని చూడటానికి ఆసక్తి కనబరుస్తుంటారు. ఇవి ప్రకృతిలో ఎలాంటి ప్రతిబంధకాలు లేకుండా స్వేచ్ఛగా తిరుగుతుంటాయి.

బాదామి పట్టణంలోని అగస్త్య చెరువు విహంగ వీక్షణము

చరిత్ర

[మార్చు]
636 CE నుండి 740 CE వరకు విస్తరించిన బాదామి చాళుక్యుల సామ్రాజ్యం

ఈ ప్రాంతం చుట్టూ అనేక చారిత్రాత్మక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో చెప్పుకోదగినవి ఖ్యాద్ గ్రామం, హిరేగుడ్డ, సిద్లఫడి, కుట్‌కంకేరి (జుంజున్‌పాడి, షిగిపాడి, అనిపాడి). ఇక్కడ పురాతన రాతి సమాధులు, వర్ణచిత్రాలు చూడవచ్చును.

బాదామి చాళుక్య సామ్రాజ్యము, ఇతర సామ్రాజ్యాలు

[మార్చు]

పురాణగాథ

[మార్చు]

పురాణగాథల ప్రకారం వాతాపి రాక్షసుడు అగస్త్య మహర్షిచే ఈ ప్రాంతంలోనే సంహరింపబడ్డాడు. ఆ సంఘటనకు గుర్తుగా ఈ ప్రాంతాన్నివాతాపి అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి దగ్గరగా అయ్యవోలే అయినూరవరు అనే వర్తక సంఘం ఉండేది. ఇది కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య వాణిజ్యమును పర్యవేక్షించేది. ప్రసిద్ధ పండితుడు డాక్టర్ డి. పి. దీక్షిత్ అభిప్రాయం ప్రకారం క్రీస్తు శకం 500 సంవత్సరంలో మొదటి చాళుక్య రాజు జయసింహ చాళుక్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతని మనవడు పులకేశి వాతాపిలో కోట కట్టించాడు.

బాదామి చాళుక్యులు

[మార్చు]

కీర్తివర్మ కుమారుడు పులకేశి. ఇతను వాతాపిని బలోపేతం చేసి విస్తరించాడు. ఇతనికి ముగ్గురు కుమారులు. రెండవ పులకేశి, విష్ణువర్ధన, బుద్దవరస. అతను మరణించేనాటికి ముగ్గురు కుమారులు చిన్నవారు కావడంచేత కీర్తివర్మ మరియొక కుమారుదు మంగలేశ రాజ్యాధికారాన్ని చేపట్టాడు. ఇతను తనదైన శైలిలో పరిపాలించి శాశ్వతంగా పగ్గాలు చేపట్టాలనుకున్నాడు. కానీ రెండవ పులకేశి చేతిలో హత్యకు గురయ్యాడు. తర్వాత రెండవ పులకేసి క్రీస్తుశకం 610 నుండి 642 వరకు బాదామి సామ్రాజ్యాన్ని పరిపాలించాడు. వాతాపిని కేంద్రముగా చేసుకొని చాళుక్యులు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు లోని కొన్ని ప్రాంతాలకు తమ సామ్రాజ్యాన్ని విస్తరించారు. 6 నుండు 8 వ శతాబ్దం వరకు వీరు విజయవంతంగా పరిపాలన సాగించారు.

శాసనాలు

[మార్చు]

బాదామిలో మొత్తం ఎనిమిది శాసనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని అతి ప్రధానమైనవి. వీటిలో మొదటిది సంస్కృత, పాత కన్నడ భాషలో 543 CE పులకేశి కాలం నాటిది.రెండవది 578 CE మంగళేశ శాసనము కన్నడ భాషలో ఉంది. మూడవది కప్పే ఆరభట్ట రికార్డులలోనిది. ఇది కన్నడ సాహిత్యంలో త్రిపది వాడుకలో లభించిన మొదటి కవిత. భూతనాధ ఆలయం వద్ద లభించిన ఒకశాసనం 12 వశతాబ్దమునకు చెందినదిగా భావింపబదుతున్నది. ఇందులో జైన శైలిలో త్రికంటర ఆదినాధను కీర్తిస్తూ రాతలు రాయబడ్డాయి.

వాతాపి గణపతి

[మార్చు]

కర్ణాటక సంగీతం లోని హంసధ్వని రాగం లోని వాతాపి గణపతిం భజే కీర్తన. సంకలనం శ్రీ ముత్తుస్వామి దీక్షితార్.[1]. వాతాపి గణపతి విగ్రహమును తదనంతరం పల్లవులు తమ రాజధాని ఐన తంజావూరుకు తరలించుకొని పోయారు. 7వ శతాబ్దంలో చాళుక్యులను ఓడించి పల్లవులు ఈ విగ్రహాన్ని తరలించుకొని పోయారు.[2]

దర్శనీయ ప్రదేశాలు

[మార్చు]

బాదామిలో అనేక పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి గుహాలయాలు, శిలా తోరణాలు, కోటలు, శిల్పాలు ఉన్నాయి.

  • ఇక్కడ ఉన్న బౌద్ధ గుహలోనికి కేవలం మోకాళ్లపై పాకుతూ మాత్రమే వెళ్ళగలము.
  • 5వ శతాబ్దంలో కట్టబడిన భూతనాధ ఆలయం ఒక చిన్న గుడి. ఇది అగస్త్య చెరువునకు ఎదురుగా నిర్మించబడింది.
  • కొండపై నిర్మింపబడిన బాదామి కోట
  • 7వ శతాబ్దంలో నిర్మింపబదిన అనేక శివాలయాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మేలెగట్టి శివాలయం.
  • దత్తాత్రేయ ఆలయం
  • 11వ శతాబ్దంలో నక్షత్రాకారంలో నిర్మింపబడిన మల్లికార్జున ఆలయం
  • కోట దక్షిణ భాగాన ఇస్లామిక్ శైలిలో నిర్మింపబడిన గుమ్మటము. ఇక్కడ ప్రార్థనలు చేసుకొనే వీలుంది.
  • బాదామి నగరాన్ని వీక్షించుటకు వీలుగా ఉత్తర కోటలో నిర్మించిన ఎత్తైన స్థానాలు
  • హిందువులలో కొందరు కులదేవతగా కొలిచే బనశంకరి ఆలయము.
  • బాదామి, ఐహోల్, పత్తడకల్ ప్రాంతాల నుండి సేకరించిన శిల్పాలతో ఏర్పాటుచేసిన పురాతత్వ సంగ్రహశాల (మ్యూజియం).

రవాణా సౌకర్యాలు

[మార్చు]

చిత్ర మాలిక

[మార్చు]

పురాతన శాసనాలు, కట్టడాలు

[మార్చు]
బాదామి గుహాలయము 3.లో 578 CE సంవత్సర కాలంలోని బాదామి చాళుక్య రాజు మంగలేశ ఏలుబడిలోని పురాతన కన్నడ శాసనము

ఇవి కూడ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Kalpana sunder (2010-03-07). "Rocky tryst with history". The Hindu. Chennai, India. Retrieved 2010-03-28.
  2. "Vatapi Ganapati". Retrieved 2010-03-28.

బయటి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బాదామి&oldid=4339893" నుండి వెలికితీశారు