కథువా
కథువా | ||||||
---|---|---|---|---|---|---|
పై నుండి సవ్యదిశలో: అటల్ సేతు, జస్రోటా ఫోర్ట్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ | ||||||
Coordinates: 32°23′06″N 75°31′01″E / 32.385°N 75.517°E | ||||||
దేశం | భారతదేశం | |||||
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు | |||||
జిల్లా | కథువా | |||||
Government | ||||||
• Type | పురపాలక సంఘం | |||||
• Body | Kathua Municipal Council (27 seats) | |||||
• చైర్మెన్ (పురపాలక సంఘం) | నిర్దోష్ శర్మ (బిజెపి) | |||||
విస్తీర్ణం | ||||||
• Total | 28.32 కి.మీ2 (10.93 చ. మై) | |||||
Elevation | 393 మీ (1,289 అ.) | |||||
జనాభా (2011) | ||||||
• Total | 59,866 | |||||
• జనసాంద్రత | 3,765/కి.మీ2 (9,750/చ. మై.) | |||||
భాషలు | ||||||
Time zone | UTC+5:30 | |||||
పిన్‌కోడ్ | 184101(ప్రధాన), 184104(మినీ) | |||||
ప్రాంతపు కోడ్ | 01922 | |||||
అక్షరాస్యత | 86.46% | |||||
Website | http://kathua.nic.in/ | |||||
[1][2][3][4] |
కథువా పట్టణం, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉన్న జమ్మూ కాశ్మీర్ భారత కేంద్ర భూభాగంలో ఉన్న ఒక పట్టణం.ఈ పట్టణం అదే పేరుతో ఉన్న జిల్లా ప్రధాన కార్యాలయ కేంద్రస్థానం.ఇది కథువా పురపాలక సంఘం హోదా కలిగి, 27 వార్డులుగా విభజించబడింది.ఈ పట్టణం జాతీయ రహదారి-44పై, సందడిగా ఉండే పారిశ్రామిక ప్రాంతంతో ఉంది.దాని ప్రక్కనే సైనికదళ శిబిరాల ఉన్నాయి.[5] [6] ఇది రవి నదికి పశ్చిమాన, పంజాబ్ రాష్ట్ర సరిహద్దుకు సమీపంలో, జమ్మూకు ఆగ్నేయంగా 45 మైళ్ళు (72 కిమీ) దూరర . ఉంది.[7]
భౌగోళికం
[మార్చు]కథువా పట్టణం 32°22′N 75°31′E / 32.37°N 75.52°E అక్షాశ,రేఖాంశాల వద్ద ఉంది. ఇది సముద్ర మట్టంకన్నా 393 మీటర్లు (1,289 అడుగులు) సగటు ఎత్తులో ఉంది.నగరం చుట్టూ మూడు నదులు ఉన్నాయి.రవినది కేవలం 7 కి.మీ. దూరంలో, ఉజ్ నది 11 కి.మీ దూరంలో ఉండగా, ఖాద్ నది ఒడ్డున కథువా పట్టణం జమ్మూ ఉన్నత రహదారిలో కి.మీ.దూరంలోనే ఉంది.ఇది భారీగా కలుషితమైంది,ఆక్రమణలకు గురైంది.ఇది కథువా సమీపంలోఉన్నందున మురుగునీటి కాలువగా మారింది.ఇది పట్టణాన్నిరెండు చిన్న పట్టణాలుగా విభజిస్తుంది. (ఒకవైపు పార్లివాండ్,మరొక వైపు ఓర్లివాండ్ అని అర్థం), ఈ ప్రాంతం కథువాకు ఉత్తరాన మంచుతో కప్పబడిన శివాలిక్ కొండల చుట్టూ ఉంది.ఇది జమ్మూ కాశ్మీర్‌కు ప్రవేశ ద్వారం లాంటిది. కథువా జమ్మూకు దక్షిణాన 88 కి.మీ.దూరంలో ఉంది. [8]
గణాంకాలు
[మార్చు]జనాభా
[మార్చు]కథువా పట్టణ ప్రాంత మొత్తం జనాభా (పురపాలక సంఘం పరిధి, బయటి పెరుగుదల కలుపుకుని 59,688 మంది,అందులో పురుషులు 31,717 మంది, 28,149 మంది మహిళలు ఉన్నారు.లింగ నిష్పత్తి ప్రతి1000 పురుషులకు 888 మంది మహిళలు ఉంది.పురపాలక సంఘం పరిధి, బయటి పెరుగుదల ప్రాంతంలో మొత్తం 12,061 గృహాలు ఉన్నాయి.
అక్షరాస్యత
[మార్చు]పురపాలక సంఘం పరిధి, బయటి పెరుగుదల ప్రాంతంలోని మొత్తం జనాభాలో 46359 మంది అక్షరాస్యులు,13,507 మంది నిరక్షరాస్యులు ఉన్నారు.అక్షరాస్యత రేటు 86.46%గా ఉంది. స్త్రీల, పురుష అక్షరాస్యత వరుసగా 90.7% (25,605 మంది) 81.75% (20,754 మంది) వద్ద ఉంది
భాషలు
[మార్చు]ఉర్దూతో పాటు అధికారిక ప్రభుత్వ పత్రాల్లో ఆంగ్గ్లభాష వాడకం అధికంగా ఉంది,కానీ వ్యావహారికంలో డోగ్రీ మాతృభాషతో పాటు ప్రజలు హిందీభాషను మాట్లాడతారు .
మతాలు
[మార్చు]కథువాలో హిందూ మతం అతిపెద్ద మతం,వీరు మొత్తం జనాభాలో 91% మంది ప్రజలు ఉన్నారు. సిక్కు మతం 4.75% మంది అనుచరులతో రెండవ అతిపెద్ద మతంగా. క్రైస్తవ మతం,ఇస్లాం జనాభా వరుసగా1.09% మంది, 2.68% మంది ఉన్నారు. [9]
రవాణా
[మార్చు]కథువా జమ్మూ నగరం నుండి 80 కి.మీ. దూరంలో, కత్రా నుండి 120 కి.మీ. జాతీయ రహదారి 44కి దగ్గరగా ఉండటం వల్ల అంతర్రాష్ట్ర రహదారి అయినందున రవాణాకు సులభంగా ఉంది. నగరంలో రెండు బస్సు స్టాండ్లు, ఉన్నత రహదారి సమీపంలో బస్సులు నిలుచు స్థానాలు ఉన్నాయి. జమ్మూ విమానాశ్రయం సాధారణ విమానాలతో సమీప మేజర్ విమానాశ్రయం.ఈ పట్టణాన్ని భారత రైల్వేలు భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాలకు అనుసంధానించాయి. పట్టణ పరిసర ప్రాంతాలలో ప్రయాణించడానికి ఇంట్రా-జిల్లా రవాణా కూడా సులభంగా లభిస్తుంది.
వాతావరణం
[మార్చు]కథువాలో రుతుపవనాల ప్రభావంతో తేమతో కూడిన ఉపఉష్ణమండల వాతావరణం ఉంది.కథువా సాధారణంగా పవానాభిముఖంగా ఉండటం వర్షాకాలంలో తీవ్ర వర్షాలు కురుస్తుంటాయి శివలిక్ నదుల సామీప్యత కారణంగా, వేసవికాలంలో చాలా వేడిగా ఉంటుంది. శీతాకాలంలో వాతావరణం తేలికపాటి నుండి చాలా చల్లగా ఉంటుంది. వేసవికాలంలో ఉష్ణోగ్రత 41 డిగ్రీల వరకు పెరిగి వేడిగా ఉంటుంది.శీతాకాలంలో ఉష్ణోగ్రత 2 డిగ్రీల వరకు పడిపోతుంది. జూలై, ఆగస్టులలో వర్షాకాలంలో భారీ వర్షాలు కురుస్తాయి.వార్షిక వర్షపాతం 1300 మి.మీ. (51 అంగుళాలు) ఉంటుంది. ప్రధానంగా వర్షాకాలం, శీతాకాలాలలో పట్టణం హిమపాతం అంతగా ఉండదు. ఫిబ్రవరి, మార్చిలో చాలా అరుదుగా భారీ వడగళ్ళుతో కూడిన వర్షాలు కురుస్తాయి.పొగమంచు కొన్నిసార్లు ఉంటుంది.పొగమంచు ముఖ్యంగా జనవరి, ఫిబ్రవరి (శీతాకాలం)లో క్రమం తప్పకుండా సంభవిస్తుంది.
సరిహద్దులు
[మార్చు]కథువా పట్టణానికి నైరుతి దిశలో పాకిస్తాన్, దక్షిణ, ఆగ్నేయంలో పంజాబ్ రాష్ట్రం, తూర్పున హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం సరిహద్దులుగా ఉన్నాయి. బాగా విచ్ఛిన్నమైన సివాలిక్ రేంజ్ వాయవ్య-ఆగ్నేయ ధోరణిలో పట్టణానికి ఉత్తరాన దాటుతుంది.ఈ ప్రాంతంలోని ప్రధాన పంటలలో గోధుమలు, వరి, చెరకు ఉన్నాయి.[7]
ఇది కూడ చూడు
[మార్చు]సరాసరి వాతావరణ పట్టిక
[మార్చు]శీతోష్ణస్థితి డేటా - Kathua (1983–2010) | |||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
నెల | జన | ఫిబ్ర | మార్చి | ఏప్రి | మే | జూన్ | జూలై | ఆగ | సెప్టెం | అక్టో | నవం | డిసెం | సంవత్సరం |
అత్యధిక రికార్డు °C (°F) | 30.4 (86.7) |
28.6 (83.5) |
36.8 (98.2) |
43.6 (110.5) |
44.8 (112.6) |
48.0 (118.4) |
42.5 (108.5) |
39.0 (102.2) |
38.8 (101.8) |
39.6 (103.3) |
32.2 (90.0) |
28.5 (83.3) |
48.0 (118.4) |
సగటు అధిక °C (°F) | 18.1 (64.6) |
21.6 (70.9) |
26.5 (79.7) |
33.1 (91.6) |
37.1 (98.8) |
37.3 (99.1) |
34.1 (93.4) |
33.2 (91.8) |
32.8 (91.0) |
30.5 (86.9) |
26.5 (79.7) |
21.0 (69.8) |
29.3 (84.8) |
సగటు అల్ప °C (°F) | 6.3 (43.3) |
9.1 (48.4) |
13.0 (55.4) |
17.9 (64.2) |
22.6 (72.7) |
24.6 (76.3) |
24.1 (75.4) |
23.8 (74.8) |
22.1 (71.8) |
16.6 (61.9) |
11.3 (52.3) |
7.4 (45.3) |
16.6 (61.8) |
అత్యల్ప రికార్డు °C (°F) | −1.8 (28.8) |
0.2 (32.4) |
5.6 (42.1) |
9.2 (48.6) |
14.4 (57.9) |
17.6 (63.7) |
14.0 (57.2) |
14.0 (57.2) |
11.5 (52.7) |
7.4 (45.3) |
3.6 (38.5) |
0.0 (32.0) |
−1.8 (28.8) |
సగటు వర్షపాతం mm (inches) | 46.3 (1.82) |
73.2 (2.88) |
43.3 (1.70) |
35.4 (1.39) |
34.0 (1.34) |
114.7 (4.52) |
329.4 (12.97) |
425.9 (16.77) |
127.2 (5.01) |
26.9 (1.06) |
18.4 (0.72) |
20.0 (0.79) |
1,294.7 (50.97) |
సగటు వర్షపాతపు రోజులు | 3.2 | 3.8 | 3.5 | 2.5 | 3.1 | 6.4 | 12.7 | 11.9 | 6.2 | 1.4 | 1.0 | 1.8 | 57.5 |
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) | 86 | 80 | 72 | 56 | 47 | 61 | 83 | 87 | 83 | 75 | 80 | 86 | 75 |
Source: India Meteorological Department[10] |
మూలాలు
[మార్చు]- ↑ Directorate of Census Operations, Jammu and Kashmir (union territory) (n.d.). District Census Handbook Kathua (Part-A) (PDF) (Report). pp. 8–17, 33–40, 44–47, 55, 56, 287, 296.
- ↑ Directorate of Census Operations, Jammu and Kashmir (union territory) (n.d.). District Census Handbook Kathua (Part-B) (PDF) (Report). pp. 7–14, 28–29, 36–39.
- ↑ "District Kathua, Jammu& Kashmir".
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Housing and Urban Development Department, Government of Jammu & Kashmir". jkhudd.gov.in. Retrieved 2020-05-14.
- ↑ "District Kathua, Government of Jammu & Kashmir | The Gateway to Jammu and Kashmir | India" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-12-01.
- ↑ https://kathua.nic.in/
- ↑ 7.0 7.1 "Kathua | India". Encyclopedia Britannica (in ఇంగ్లీష్). Retrieved 2020-12-01.
- ↑ Falling Rain Genomics, Inc - Kathua
- ↑ "Kathua City Population". Census India. Retrieved 27 September 2020.[permanent dead link]
- ↑ "1981-2010 CLIM NORMALS (STATEWISE).pdf" (PDF). India Meteorological Department. pp. 399–400. Archived from the original (PDF) on 5 February 2020. Retrieved 24 March 2020.