Jump to content

ఎల్లంకి

వికీపీడియా నుండి

ఎల్లంకి, తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలంలోని గ్రామం.[1]

ఎల్లంకి
—  రెవిన్యూ గ్రామం  —

Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided.

రాష్ట్రం తెలంగాణ
జిల్లా యాదాద్రి - భువనగిరి జిల్లా
మండలం రామన్నపేట
ప్రభుత్వం
 - సర్పంచి ఎడ్ల మహేందర్ రెడ్డి
జనాభా (2011)
 - మొత్తం 5,846
 - పురుషుల సంఖ్య 2,933
 - స్త్రీల సంఖ్య 2,913
 - గృహాల సంఖ్య 1,428
పిన్ కోడ్ 508113
ఎస్.టి.డి కోడ్ 08694

ఇది మండల కేంద్రమైన రామన్నపేట నుండి 8 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన నల్గొండనుండి 42 కి. మీ. దూరంలోనూ ఉంది.గ్రామానికి ఉత్తర దిశకు మూడు కిలోమీటర్లపై చారిత్రక ప్రదేశాలు నీలగిరి (నల్గొండ), భువనగిరి లను కలిపే రోడ్డు ఉంది. దక్షిణాన ఆరు కిలోమీటర్లపై హైదరాబాదు నుండి విజయవాడకు వెళ్ళు రహదారి ఉంది.ప్రస్తుతము ఈ గ్రామం వ్యవసాయిక, సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, వ్యాపార రంగాల్లో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలోపురోగమిస్తూ, ప్రగతి పధాన నడుస్తుంది.

జిల్లాల పునర్వ్యవస్థీకరణలో

[మార్చు]

2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత నల్గొండ జిల్లాలోని ఇదే మండలంలో ఉండేది.[2]

గ్రామ జనాభా

[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1428 ఇళ్లతో, 5846 జనాభాతో 2549 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 2933, ఆడవారి సంఖ్య 2913. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 942 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 68. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 576843[3].పిన్ కోడ్: 508113.

అనుభంధ గ్రామాలు

[మార్చు]

ఈ గ్రామానికి అనుభంధంగా ఉన్న మజరా గ్రామాలు ఆరు ఉన్నాయి.

సమీప గ్రామాలు

[మార్చు]

గ్రామానికి నాలుగు వైపులా ఉన్న గ్రామాలు పడమట సర్నేనిగూడెం, ఉత్తరాన తుమ్మలగూడెం, గొల్నేపల్లి, తూర్పున సిరిపురం, దక్షిణాన గుండ్రాంపల్లి గ్రామాలు ఉన్నాయి.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు నాలుగు, ప్రైవేటు ప్రాథమిక పాఠశాల ఒకటి, ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలు రెండు, ప్రైవేటు ప్రాథమికోన్నత పాఠశాల ఒకటి, ప్రభుత్వ మాధ్యమిక పాఠశాల ఒకటి ఉన్నాయి.జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉన్నాయి.సమీప బాలబడి రామన్నపేటలో ఉంది.సమీప జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఆర్ట్స్ / సైన్స్ డిగ్రీ కళాశాల రామన్నపేటలోను, ఇంజనీరింగ్ కళాశాల చెర్లపల్లిలోనూ ఉన్నాయి. సమీప వైద్య కళాశాల నార్కట్ పల్లిలోను, మేనేజిమెంటు కళాశాల, పాలీటెక్నిక్‌లు నల్గొండలోనూ ఉన్నాయి. సమీప వృత్తి విద్యా శిక్షణ పాఠశాల రామన్నపేటలోను, అనియత విద్యా కేంద్రం, దివ్యాంగుల ప్రత్యేక పాఠశాల‌లు నల్గొండలోనూ ఉన్నాయి.

వైద్య సౌకర్యం

[మార్చు]

ప్రభుత్వ వైద్య సౌకర్యం

[మార్చు]

ఎల్లంకిలో ఉన్న ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఇద్దరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. పశువుల ఆరోగ్య పరిరక్షణకై ఒక ప్రభుత్వ పశువైద్యశాల ఉంది కానీ గ్రామ ప్రజల ఆరోగ్య సంరక్షణ కొరకు ప్రభుత్వ వైద్యశాల నిర్మించవలసి ఉంది. సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. డిస్పెన్సరీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, పశు వైద్యశాల, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.

ప్రైవేటు వైద్య సౌకర్యం

[మార్చు]

ఒక మందుల దుకాణం ఉంది.

తాగు నీరు

[మార్చు]

గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది.

పారిశుధ్యం

[మార్చు]

మురుగునీరు బహిరంగ కాలువల ద్వారా ప్రవహిస్తుంది. మురుగునీటిని శుద్ధి ప్లాంట్‌లోకి పంపిస్తున్నారు. గ్రామంలో సంపూర్ణ పారిశుధ్య పథకం అమలవుతోంది. సామాజిక మరుగుదొడ్డి సౌకర్యం లేదు. ఇంటింటికీ తిరిగి వ్యర్థాలను సేకరించే వ్యవస్థ లేదు. సామాజిక బయోగ్యాస్ ఉత్పాదక వ్యవస్థ లేదు. చెత్తను వీధుల పక్కనే పారబోస్తారు.

సమాచార, రవాణా సౌకర్యాలు

[మార్చు]

ఎల్లంకిలో సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉంది. పోస్టాఫీసు సౌకర్యం, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి. ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

గ్రామ శివార్ల నుండి చుట్టూ ఉన్న గ్రామాలకు అనగా వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్, గుండ్రాంపల్లి గ్రామాలకు థార్ రోడ్డు సౌకర్యం కలదు కానీ గ్రామంలోని అంతర రొడ్డు నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి.మొత్తం మూడు ఆర్.టి.సి బస్సులు ఉన్నాయి. ఆటోల సౌకర్యం ఉంది. బస్సులు రామన్నపేట నుండి చౌటుప్పల్, చౌటుప్పల్ నుండి రామన్నపేటకు ఉంటాయి.

గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. ప్రైవేటు బస్సు సౌకర్యం గ్రామానికి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. రైల్వే స్టేషన్ గ్రామానికి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది.

జిల్లా రహదారి గ్రామం గుండా పోతోంది. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 కి.మీ. లోపు దూరంలో ఉంది. ప్రధాన జిల్లా రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.

మార్కెటింగు, బ్యాంకింగు

[మార్చు]

గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం ఉన్నాయి. ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు, వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. రోజువారీ మార్కెట్, వారం వారం సంత, వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి.

ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు

[మార్చు]

గ్రామంలో అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. శాసనసభ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సమీకృత బాలల అభివృద్ధి పథకం, ఆటల మైదానం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. సినిమా హాలు, పబ్లిక్ రీడింగ్ రూం గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉన్నాయి. గ్రంథాలయం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.

విద్యుత్తు

[మార్చు]

గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.

భూమి వినియోగం

[మార్చు]

ఎల్లంకిలో భూ వినియోగం కింది విధంగా ఉంది:

  • వ్యవసాయేతర వినియోగంలో ఉన్న భూమి: 141 హెక్టార్లు
  • వ్యవసాయం సాగని, బంజరు భూమి: 38 హెక్టార్లు
  • శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 182 హెక్టార్లు
  • తోటలు మొదలైనవి సాగవుతున్న భూమి: 17 హెక్టార్లు
  • వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 40 హెక్టార్లు
  • సాగులో లేని భూముల్లో బీడు భూములు కానివి: 484 హెక్టార్లు
  • బంజరు భూమి: 671 హెక్టార్లు
  • నికరంగా విత్తిన భూమి: 976 హెక్టార్లు
  • నీటి సౌకర్యం లేని భూమి: 1895 హెక్టార్లు
  • వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 236 హెక్టార్లు

నీటిపారుదల సౌకర్యాలు

[మార్చు]

ఎల్లంకిలో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.సాగర్ నీటి సౌకర్యం ఉంది.

  • బావులు/బోరు బావులు: 40 హెక్టార్లు* చెరువులు: 196 హెక్టార్లు

చెరువులు

[మార్చు]

శంభుని చెరువు, పాత చెరువు, ఈదులకుంట అను మూడు చెరువులు చుట్టుగా కలిగి మద్యన గల ద్వీపకల్పం వలె ఉండటం చేత వెల్లంకి అయింది. వెల్లంకి అనగా "గడ్డ ప్రాంతం" అని అర్ధం. ఈ పూర్ణానుసారం శబ్దానురీత్యా ఎల్లంకి వ్యవహారంలో వెల్లంకిగా మారింది. ఈ మూడు చెరువుల్లో నాటి దేశ్ ముఖ్ అనుముల రామచంద్రరావు దొరకు చెందిన శంభుని చెరువు రెండవదగు ఈదులకుంట గ్రామంలోని ప్రముఖులది. పాతచెరువు గ్రామస్తులందరిదిగా ఆ నీటి పారుదలతో వారి భూములను సాగు చేసుకొనుట జరిగేది. ఇలా ఈ మూడు చెరువుల మధ్యస్థమైన పీఠభూమి (ద్వీపకల్పం) గా ఉన్నదే వెల్లంకి గ్రామంగా చరితార్ధమైంది.

గ్రామంలో మూడు చెరువులు ఉన్నాయి అవి శంభుని చెరువు, ఈదుల కుంట, పాత చెరువు. శంభుని చెరువు 120 ఎకరాలు, ఈదుల కుంట 40 ఎకరాలు, పాత చెరువు 116 ఎకరాలు విస్తీర్ణంలో ఉంటాయి.

ఉత్పత్తి

[మార్చు]

ఎల్లంకిలో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

వరి

పారిశ్రామిక ఉత్పత్తులు

[మార్చు]

వస్త్రాలు & చీరలు

విద్యుద్దీపాలు

[మార్చు]

ఇక్కడ విద్యుద్దీపాలు అంతంత మాత్రంగా ఉన్నాయి. కానీ విద్యుత్ మాత్రం చిన్న చిన్న అంతరాయలతో రోజంతా ఉండటం విశేషం.

రాజకీయం

[మార్చు]

గ్రామములో కమ్యూనిష్ఠు, కాంగ్రెస్, తె.దే.పా, తె.రా.స, భా.జా.పా. పార్టీలు ఉన్నాయి. ప్రస్తుత గ్రామ సర్పంచి ఎడ్ల మహేందర్ రెడ్డి తెరాస తరపున 25 jan 2019 రోజున 600 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

దేవాలయాలు

[మార్చు]

గ్రామంలో నాలుగు ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి ఒకటి శివాలయం, రెండోది భక్తాంజనేయ స్వామి ఆలయం, మూడవది శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం, నాలుగవది ఎల్లమ్మతల్లి దేవాలయం.

శివాలయం

[మార్చు]

క్రీ. శ. 9వ శతాబ్దము కాకతీయుల కాలంలో నిర్మించబడిందని గ్రామ పెద్దలు చెబుతుంటారు. గ్రామంలోని కొందరు పెద్దల ఆధ్వర్యంలో ఆలయాన్ని కూల్చివేసి అదే స్థానంలో నూతన ఆలయాన్ని నిర్మించాలని తలచి తరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని కూల్చివేసారు. ఇప్పుడు నూతన ఆలయం నిర్మించబడింది.

భక్తాంజనేయ స్వామి దేవాలయం

[మార్చు]

1948 ప్రాంతంలో నిర్మించబడింది. శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం 2000 సంవత్సరంలో నిర్మించబడింది. ఎల్లమ్మతల్లి దేవాలయం 2009లో నిర్మించబడింది. ఇంకా గ్రామంలో ప్రత్యేకంగా కుల దేవతల దేవాలయాలు ఊరి పొలిమేరలలో ఉన్నాయి అవి గీత కార్మికులు పూజించే కాటమయ్య, పద్మశాలీలు పూజించే మద్దెలమ్మ, రజకులు పూజించే మడేలయ్య ఇంకా మిగిలిన కులాల వారు పూజించే మారమ్మతల్లి దేవాలయాలు ఉన్నాయి.

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం

[మార్చు]
శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారి శిలా విగ్రహాలు.

1997 ఆగస్టు 15 రోజున ఆలయ నిర్మాణము తలపెట్టుటకు కొందరు గ్రామ ప్రముఖులు సభ ఏర్పాటు చేసుకొని విరాళాల ద్వారా ఆలయ గర్భగుడి యొక్క భూమిని కొన్నారు. అప్పుడు చెన్నోజు వీరాచారి (ఆలయ పూజారి) దేవాలయ అధ్యక్షునిగా ఎన్నుకోబడ్డారు. పున్న రమేష్ ఆలయ కోశాధికారిగా ఎన్నుకోబడ్డారు. 1999 జూలై 25 నాడు విజయవాడ వాస్తవ్యులు చింతాడ విశ్వనాధ శాస్త్రి నిర్ణయించబడిన ముహూర్తానికి 2000వ సం. ఫిబ్రవరి 10 ఉదయం గం 8:15 ని లకు దేవాలయ శంకుస్థాపన చేయడం జరిగింది. 2001 జనవరి 26న ఎల్లంకి గ్రామపంచాయతి అంగీకారంతో గట్టు మల్లారెడ్డికి చెందిన ట్రాక్టరుపై ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో శ్రీ గోవిందమాంబ సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి విగ్రహాలు తీసుకొని వస్తూ వస్తూ సమీప 18 గ్రామాలలో 20,000 రూపాయలు విరాళాలు సేకరించి గ్రామానికి చేరుకున్నారు. పిదప దేవాలయ నిర్మాణం పూర్తయ్యే వరకు సమీప గ్రామం అయిన సాగుబావిగూడెంలో విగ్రహాలను ఉంచారు. అవి ప్రమాదవ శాత్తూ అగ్నికి ఆహుతి అయ్యాయి. మళ్ళీ ఎల్లంకి సమీప 12 గ్రామాల్లో విరాళములు సేకరించి, మరికొందరి దాతల సహకారంతో విగ్రహాలను కొనుగోలు చేసి 2004 మార్చి 8న మూల విరాట్ విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగింది. 2005 ఫిబ్రవరి 13 ఆదివారం ధ్వజస్తంభ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అదే రోజున కూరెళ్ళ భిక్షమాచారి తండ్రి కూరెళ్ళ నరసింహ చారి స్మృతిగా అందజేసిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఉత్సవ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుపబడింది. 2006 ఫిబ్రవరి 23 గురువారం రోజున దేవాలయానికి మలివిడత స్థల సేకరణ, భూమి పూజ. ముఖద్వార శంకుస్థాపన చేయబడింది. నవగ్రహ ప్రతిష్ఠ 2008 మార్చి 2న జరిగింది. ఇలా క్రమంగా దాతల సహకారంతో దేవాలయ అభివృద్ధి జరిగింది.

జీవనోపాధి

[మార్చు]

గ్రామంలో వివిధ కులాల వారున్నప్పటికీ పద్మశాలి మినహా అన్ని కులాల వారు ప్రధానంగా వ్యవసాయం పైనే ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. పద్మశాలీలు చేనేత వృత్తి పై ఆధారపడతారు. ఇంకా పాడి పరిశ్రమ కూడా చాలా మందికి జీవనాధారంగా ఉంది. సొంత భూమి లేని వారు వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తుంటారు. కోళ్ళ పరిశ్రమ కూడా కొందరికి జీవనాధారంగా మారింది. గ్రామ రైతులు వ్యవసాయంలో ప్రధానంగా ప్రత్తి, వరి పండిస్తుంటారు. 20వ శతాబ్దం చివరి సంవత్సరం వరకు సజ్జలు, జొన్నలు, కందులు, పెసలు, ప్రముఖ వాణిజ్య పంట అయిన ఆముదం ఎక్కువగా పండించేవారు. 20వ శతాబ్దం రెండవ భాగం వరకు రైతులు పంటలు పండించడానికి బావుల నుండి నీటిని తోడటానికి విద్యుత్తు సౌకర్యం లేక గ్రామంలోని మూడు చెరువుల నుండి తూము ద్వారా లేదా బావుల నుండి మోట కొట్టి నీరందించవలసి ఉండేది అందుకే ఎక్కువగా వర్షాధార పంటలపై ఆధారపడేవారు. మోట అనేది బావి నుండి నీటిని తోడటానికి ఉపయోగించే పురాతన పద్ధతి ఆ నీటిని తోడే పాత్రలో సుమారు 100 లీటర్ల నీళ్ళు పట్టేవి. ఆ కాలంలో అన్నం వండుకోవడానికి బియ్యం దొరకక సజ్జలు, జొన్నలతో గట్క (అంబలి) వండుకొని తిని భలంగా, ఆరోగ్యంగా ఉండేవారు. ప్రస్తుతం గ్రామంలో రెండు కాలువలు ప్రవహిస్తున్నవి అవి ధర్మారెడ్డి కాలువ, పిల్లాయిపల్లి కాలువ. ధర్మారెడ్డి కాలువ ప్రధానంగా హైదరాబాద్ లోని మూసీ నది నీటిపై ఆధారపడి ఉంది.

గ్రామ ప్రముఖులు

[మార్చు]

అవార్డులు

[మార్చు]

ఈ గ్రామం 2021-2022 సంవత్సరానికిగాను తెలంగాణ ప్రభుత్వం నుండి స్వ‌యం స‌మృద్ధి మౌలిక స‌దుపాయాలున్న గ్రామాలు విభాగంలో రాష్ట్రస్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ అవార్డును అందుకుంది.[4][5]

చిత్ర మాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "యాదాద్రి భువనగిరి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
  3. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  4. "రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీలివే". EENADU. 2023-03-31. Archived from the original on 2023-03-30. Retrieved 2023-04-05.
  5. telugu, NT News (2023-03-30). "Telangana | 47 ఉత్తమ పంచాయతీలకు అవార్డులు.. 31న‌ హైదరాబాద్‌లో అవార్డుల ప్రదానం". www.ntnews.com. Archived from the original on 2023-03-30. Retrieved 2023-04-05.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ఎల్లంకి&oldid=4330675" నుండి వెలికితీశారు