ఆరతి (నటి)
ఆరతి | |
---|---|
జననం | ఆరతి 1954 |
వృత్తి | చలనచిత్ర నటి, దర్శకురాలు |
క్రియాశీలక సంవత్సరాలు | 1969-1987; 2005 |
మతం | హిందూ మతం |
భార్య / భర్త | చంద్రశేఖర్ దేశాయిగౌడర్ |
పిల్లలు | యశస్విని |
ఆరతి ప్రముఖ భారతీయ చలనచిత్ర నటి. ఈమె 125కు పైగా కన్నడ చిత్రాలలోను, కొన్ని తమిళ, మలయాళ, తెలుగు[1] చిత్రాలలోను నటించింది. మిఠాయి మనె అనే కన్నడ చిత్రానికి, నమ్మ నమ్మల్లి అనే కన్నడ టి.వి.సీరియల్‌కు దర్శకత్వం వహించింది. ఈమె కర్ణాటక రాష్ట్రప్రభుత్వంచే ఉత్తమ చలనచిత్ర నటిగా అవార్డును నాలుగు సార్లు, ఫిలింఫేర్ అవార్డును నాలుగు సార్లు గెలుచుకుంది. ఈమె దర్శకత్వం వహించిన మిఠాయి మనె చిత్రం కర్ణాటక రాష్ట్రప్రభుత్వంచే ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికయ్యింది. కర్ణాటక విధాన పరిషత్(శాసన మండలి)కు ఎం.ఎల్.సి.గా నియమించబడింది. బి.జయమ్మ తరువాత ఎం.ఎల్.సి.గా నామినేట్ చేయబడిన రెండవ నటి ఈమె.
వ్యక్తిగత వివరాలు
[మార్చు]ఈమె 1954లో కర్ణాటక రాష్ట్రంలో మైసూరు సమీపంలోని అరగల్‌లో జన్మించింది. ఈమె అనేక సేవా కార్యక్రమాలను చేపట్టింది. ఈమె ప్రముఖ కన్నడ దర్శకుడు పుట్టణ్ణ కణగాల్‌కు రెండవ భార్య. ఈమె 1987లో నటనకు స్వస్తి చెప్పి చంద్రశేఖర్ దేశాయిగౌడర్‌ను పెళ్ళి చేసుకుని అమెరికాలో స్థిరపడింది. ఈమెకు ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురు యశస్విని వ్రాసిన మిఠాయి మనెను ఆరతి దర్శకత్వం వహించి సినిమాగా రూపొందించింది.
సినిమా రంగం
[మార్చు]ఈమె 1969లో గజ్జెపూజె అనే కన్నడ చిత్రం ద్వారా సినీరంగ ప్రవేశం చేసింది. ఈమె 1986 వరకు అనేక కన్నడ సినిమాలలో వివిధ పాత్రలను ధరించింది. 70, 80 దశకాలలో దాదాపు అందరు కన్నడ హీరోలతో కలిసి నటించింది. నాగరహావు, ఎడకల్లు గుడ్డదమేలె, బిళి హెండతి, రంగనాయకి, హొంబిసులు, ఉపాసనె, శుభమంగళ, కల్లు వీణె నుడియితు మొదలైన సినిమాలు ఈమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. తెలుగులో చలం సరసన ఊరికి ఉపకారి అనే సినిమాలో నటించింది.
తెలుగు సినిమాలు
[మార్చు]ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:
సంవత్సరము | చిత్రము | దర్షకత్వం | తారాగణం | వివరణ |
---|---|---|---|---|
1971 | ఘరానా దొంగలు | ఎ.ఎం.సమీనుల్లా | ఉదయ్‌కుమార్ | డబ్బింగ్ సినిమా |
1972 | ఊరికి ఉపకారి | కె.ఎస్.ఆర్.దాస్ | చలం, గుమ్మడి, అంజలీదేవి | |
1973 | దసరా పిచ్చోడు | వై.ఆర్.స్వామి | రాజ్‌కుమార్ | డబ్బింగ్ సినిమా |
1976 | ప్రచండ వీరుడు | ఆమంచర్ల శేషగిరిరావు | రాజ్‌కుమార్, జయంతి | డబ్బింగ్ సినిమా |
1977 | నన్ను ప్రేమించు | పుట్టణ్ణ కణగాల్ | రజనీకాంత్ | డబ్బింగ్ సినిమా |
1980 | భక్త శిరియాళ | హుణసూరు కృష్ణమూర్తి | లోకేష్, అశ్వథ్, శ్రీనివాస్, సుందరకృష్ణ | డబ్బింగ్ సినిమా |
1985 | అఖండ నాగప్రతిష్ట | అర్జున్, మహాలక్ష్మి | డబ్బింగ్ సినిమా |
మూలాలు
[మార్చు]- ↑ Rajadhyaksha, Ashish; Willemen Routledge, Paul (1999). My library My History Books on Google Play Encyclopedia of Indian Cinema (2,Revised ed.). New York: Routledge. pp. 1943, 1944. ISBN 1-57958-146-3. Retrieved 10 March 2017.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆరతి పేజీ