Jump to content

అనుభవం

వికీపీడియా నుండి

అనుభవం ను ఇంగ్లీషులో Experience అంటారు. ఒక వ్యక్తి తన జీవితంలో ఎదుర్కొన ఆటుపోటుల నుంచి లభించిన జ్ఞానమును అనుభవం అంటారు. ఒక వ్యక్తి పుస్తకాలను చదివి నేర్చుకున్న జ్ఞానం కన్నా తన అనుభవం ద్వారా లభించిన జ్ఞానంతో సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలడు. ఒక పనిలో అనుభవం ద్వారా నైపుణ్యాన్ని సాధించిన వారిని అనుభవజ్ఞులు అంటారు. సాధారణంగా అనుభవంలేని వ్యక్తి కన్నా అనుభవం ఉన్న వ్యక్తి చేసిన పనిలో మంచి ఫలితాలు వస్తాయి. పుస్తకాలను చదవడం ద్వారా సంపాదించినది జ్ఞానం అయితే పనిని చేయడం ద్వారా ఉదాహరణకు స్వయంగా చేపలను పట్టుకోవడం ద్వారా సంపాదించిన జ్ఞానాన్ని చేపలను పట్టుకోవడంలో సంపాదించుకున్న అనుభవం అంటారు.

అనుభవజ్ఞుడు

[మార్చు]

అనుభవజ్ఞుడిని ఇంగ్లీషులో Expert అంటారు. వివిధ రంగాలలో నైపుణ్యాన్ని సాధించిన మగవారిని అనుభవజ్ఞుడు లేక నిపుణుడు అని, నైపుణ్యం గల మహిళలను అనుభవజ్ఞురాలు లేక నిపుణురాలు అని అంటారు. కొన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి వీరి సలహాలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=అనుభవం&oldid=3177032" నుండి వెలికితీశారు