1950
1950 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1947 1948 1949 - 1950 - 1951 1952 1953 |
దశాబ్దాలు: | 1930లు 1940లు - 1950లు - 1960లు 1970లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
మార్చు- జనవరి 24 - జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా భారత ప్రభుత్వం స్వీకరించింది.
- జనవరి 25 - భారత గవర్నర్ జనరల్ పదవిని రద్దుచేసారు.
- జనవరి 26 - భారత రాజ్యాంగం అమల్లోకి రావడంతో భారత్ గణతంత్ర రాజ్యంగా అవతరించింది.
- జనవరి 26 - భారత తొలి రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ అధికారంలోకి వచ్చాడు.
- జనవరి 26 - ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం అవతరించింది.
- జనవరి 26 - భారత సుప్రీం కోర్టు పనిచెయ్యడం మొదలుపెట్టింది.
- జనవరి 26 - ఎం కె వెల్లోడి, హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారత ప్రభుత్వముచే నియమించబడ్డాడు.
- మార్చి 15 - భారతదేశ ప్రణాళికా సంఘ దినము.
- జూన్ 24: ప్రపంచ కప్ ఫుట్‌బాల్ పోటీలు బ్రెజిల్లో ప్రారంభమయ్యాయి.
- నవంబరు 7: నేపాల్ రాజుగా జ్ఞానేంద్ర పదవిలోకి వచ్చాడు.
- అక్టోబర్ 26 - మదర్ తెరెసా కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని స్థాపించింది.
జననాలు
మార్చు- జనవరి 7: శాంతా సిన్హా, సంఘ సంస్కర్త, బాల కార్మికులపై చేసిన కృషికి రామన్ మెగస్సే అవార్డు గ్రహీత.
- జనవరి 7: అనిల్ బాబర్, శివసేనకు చెందిన మహారాష్ట్ర మాజీ శాసనసభ్యుడు. (మ.2024)
- జనవరి 18 - అదృష్ట దీపక్, సినీ గేయ రచయిత, అభ్యుదయ కవి.
- మార్చి 1: షాహిద్ ఇస్రార్, పాకిస్థానీ మాజీ క్రికెటర్ (మ.2013)
- మార్చి 23: వి.డి.రాజప్పన్, మలయాళ సినిమా హాస్యనటుడు. (మ.2016)
- ఏప్రిల్ 5: ప్రబోధానంద యోగీశ్వరులు ఇందూ ధర్మప్రదాత, సంచలనాత్మక రచయిత, త్రైత సిద్ధాంత ఆదికర్త, అర్ధ శతాధిక గ్రంథకర్త
- ఏప్రిల్ 17: రజితమూర్తి. సిహెచ్, రంగస్థల, సినీ నటుడు.
- ఏప్రిల్ 20: ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
- మే 9: కల్పనా రాయ్, తెలుగు హాస్యనటి. (మ.2008)
- జూన్ 25: ఎన్.గోపి, తెలుగు పండితుడు, కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత
- జూలై 1: గుడిమెట్ల చెన్నయ్య, తెలుగు రచయిత.
- జూలై 14: గ్రంధి మల్లికార్జున రావు, వ్యాపారవేత్త .
- ఆగస్టు 5: ప్రేమ్ వాత్స, భారతీయ-కెనడియన్ బిలియనీర్ వ్యాపారవేత్త.
- ఆగస్టు 8: పిల్లి సుభాష్ చంద్రబోస్, కాంగ్రెస్ పార్టీ తరఫున మూడవసారి శాసన సభ్యులు అయ్యాడు.
- ఆగస్టు 8: వై.ఎస్.వివేకానందరెడ్డి, లోక్‌సభలకు కడప లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండు సార్లు భారత జాతీయ కాంగ్రెసు అభ్యర్థిగా ఎన్నికయ్యారు.
- సెప్టెంబరు 17: నమిలికొండ బాలకిషన్ రావు, ప్రముఖ కవి, న్యాయవాది, పత్రిక సంపాదకుడు. (మ. 2023)
- సెప్టెంబరు 17: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడి.
- సెప్టెంబరు 24: భారత క్రికెట్ జట్టు మాజీ క్రీడాకారుడు మోహిందర్ అమర్నాథ్.
- అక్టోబరు 8: చివుకుల ఉపేంద్ర, అమెరికా లోని ఫ్రాంక్లిన్‌టౌన్‌షిప్‌కు డెప్యూటీ మేయర్‌గా, 2000లో మేయర్‌గా, న్యూజెర్సీ శాసనసభ్యుడుగా, శాసనసభకు ఉపసభాపతి.
- అక్టోబరు 10: మాడా వెంకటేశ్వరరావు, తెలుగు నటుడు. (మ.2015)
- అక్టోబరు 29: తల్లావజ్ఝుల సుందరం, రంగస్థల నటుడు, దర్శకుడు, ప్రయోక్త, కథ, నవలా రచయిత. (మ.2022)
- నవంబరు 27: పోపూరి లలిత కుమారి, తెలుగు రచయిత్రి.
- డిసెంబరు 12: రజినీకాంత్, భారతదేశంలో ప్రజాదరణ కలిగిన నటుడు.
- డిసెంబరు 25: ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018)
- : షేక్ సాంబయ్య, క్లారినెట్ విద్వాంసుడు. (మ.2013)
మరణాలు
మార్చు- జనవరి 7: పెండ్యాల వేంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్ర పండితులు, విమర్శకులు, పరిశోధకులు. (జ.1877)
- జనవరి 21: జార్జ్ ఆర్వెల్, బ్రిటీష్ రచయిత.
- మే 16: పేరేప మృత్యుంజయుడు, భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, స్వాతంత్య్రసమర యోధుడు. (జ.1914)
- జూలై: జనమంచి శేషాద్రి శర్మ, తెలుగు కవి, పండితుడు. (జ.1882)
- ఆగష్టు 5: గోపీనాధ్ బొర్దొలాయి, స్వాతంత్ర్యానంతర అస్సాం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి. (జ.1890)
- ఆగష్టు 29: వేటూరి ప్రభాకరశాస్త్రి, రచయిత. (జ.1888)
- డిసెంబర్ 5: అరవింద ఘోష్, హిందూ జాతీయవాద నాయకుడు, తత్వవేత్త, యోగి.
- డిసెంబర్ 15: సర్దార్ వల్లభాయి పటేల్, భారత స్వాతంత్ర్య సమరయోధుడు.
- : ఆర్కాట్ రంగనాథ మొదలియారు, భారత రాజకీయనాయకుడు, బళ్ళారికి చెందిన దివ్యజ్ఞాన సమాజస్థుడు. (జ.1879)
- : చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, అవధాన విద్యకు రూపురేకలు తీర్చిదిద్ది, వన్నెవాసి సమకూర్చిన తిరుపతి వేంకట కవులులో ఒకరు. (జ.1870)