1779 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1776 1777 1778 - 1779 - 1780 1781 1782
దశాబ్దాలు: 1750లు 1760లు - 1770లు - 1780లు 1790లు
శతాబ్దాలు: 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం

సంఘటనలు

మార్చు
  • జనవరి 11: బ్రిటీష్ దళాలు వాడ్గావ్‌లో మరాఠాలకు లొంగిపోయాయి. 1773 నుండి స్వాధీనం చేసుకున్న అన్ని భూభాగాలను వెనక్కి ఇచ్చేసాయి.
  • జనవరి 11: చింగ్-థాంగ్ ఖోంబా మణిపూర్ రాజుగా పట్టాభిషేకం చేసుకున్నాడు.
  • ఫిబ్రవరి 14: కెప్టెన్ జేమ్స్ కుక్ తన మూడవ సముద్రయానంలో శాండ్విచ్ దీవులలో హతుడయ్యాడు.
  • మే 13: రష్యన్, ఫ్రెంచ్ మధ్యవర్తులు బవేరియన్ వారసత్వ యుద్ధానికి ముగింపు పలకడానికి చర్చలు జరిపారు. ఒప్పందంలో ఆస్ట్రియా, బవేరియన్ భూభాగంలో కొంత భాగాన్ని పొందుతుంది, మిగిలిన వాటిని వదులుకుంటుంది.
  • జూన్ 21 – స్పెయిన్ రాజు చార్లెస్ III గ్రేట్ బ్రిటన్‌కు వ్యతిరేకంగా యుద్ధ ప్రకటన జారీ చేశాడు. [1]
  • జూలై: జిబ్రాల్టర్ ముట్టడి (పద్నాలుగవదీ, చివరిదీ అయిన సైనిక ముట్టడి) ప్రారంభమైంది. బ్రిటిష్ దండు నుండి జిబ్రాల్టర్‌పై నియంత్రణ సాధించడానికి ఫ్రెంచ్, స్పానిష్ దళాలు తీసుకున్న చర్య ఇది. జార్జ్ అగస్టస్ ఎలియట్ నేతృత్వంలోని బ్రిటిషు దండు, దాడులను ఎదుర్కొని దిగ్బంధనం నుండి బయటపడింది.
  • తేదీ తెలియదు: ష్రోప్‌షైర్‌లోని సెవెర్న్ నదిపై ఐరన్ వంతెన నిర్మించారు. ఇది ప్రపంచంలో పూర్తిగా ఇనుముతో నిర్మించిన మొట్టమొదటి వంతెన. దీన్ని 1781 జనవరి 1 న తెరిచారు. [2]
  • తేదీ తెలియదు: లాంకషైర్‌కు చెందిన శామ్యూల్ క్రాంప్టన్ స్పిన్నింగ్ మ్యూల్ పై నేర్పు సాధించాడు. [2]
  • తేదీ తెలియదు: బౌల్టన్, వాట్ ల స్మెత్విక్ ఇంజను, ఇప్పుడు ప్రపంచంలోనే అతి పురాతనమైన ఇంజను, పని మొదలు పెట్టింది.

జననాలు

మార్చు
  • ఆగస్టు 1: ఫ్రాన్సిస్ స్కాట్ కీ అమెరికన్ జాతీయగీతం రచయిత
  • ఆగస్టు 20: జాన్స్ జాకబ్ బెర్జిలియస్, స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త (మ .1848)
  • మే 28: ఐరిష్ కవి థామస్ మూర్ (మ.1852)

మరణాలు

మార్చు
 
Captainjamescookportrait

పురస్కారాలు

మార్చు

మూలాలు

మార్చు
  1. William Nester, The Revolutionary Years, 1775-1789: The Art of American Power During the Early Republic (Potomac Books, 2011) p53
  2. 2.0 2.1 Williams, Hywel (2005). Cassell's Chronology of World History. London: Weidenfeld & Nicolson. pp. 333–334. ISBN 0-304-35730-8.
"https://te.wikipedia.org/w/index.php?title=1779&oldid=3858222" నుండి వెలికితీశారు