గీతా దత్

భారతీయ నటీ

గీతా దత్ ఒక భారతీయ నేపథ్య గాయని, శాస్త్రీయ కళాకారిణి.[1]

గీతా దత్
జననం
గీతా ఘోష్ రాయ్ చౌదరి

(1930-11-23)1930 నవంబరు 23
మరణం1972 జూలై 20(1972-07-20) (వయసు 41)
బొంబాయి (Present day: Mumbai), మహారాష్ట్ర, భారతదేశం
జాతీయతBritish Indian (1930–1947)
Indian (1947–1972)
వృత్తినేపధ్య గాయని, శాస్త్రీయ కళాకారిణి
క్రియాశీల సంవత్సరాలు1946–1972
జీవిత భాగస్వామి
(m. 1953; died 1964)

నేపధ్యము

మార్చు

ఈవిడ అసలు పేరు ''గీతా ఘోష్ రాయ్ చౌదరి '''. ప్రస్తుత బంగ్లాదేశ్ లోని ఇదిల్ పూర్ అనే గ్రామంలో ఒక జమీందారీ కుటుంబంలో 10వ సంతానంగా జన్మించింది.

వ్యక్తిగత జీవితము

మార్చు

1953 లో ప్రముఖ భారతీయ నటుడు, దర్శకుడు గురుదత్ని ఈవిడ వివాహం చేసుకుంది. తర్వాత ఈమె పేరు గీతా దత్ గా మారింది.

సినీ ప్రస్తానము

మార్చు

1959 లో ఈవిడ పాడిన ‘వక్త్‌ నే కియా క్యా హసీ సితమ్‌ ... హమ్‌  రహేన హమ్‌ తుమ్‌ రహేన హమ్‌’... అనే పాట కాగజ్ కే ఫూల్ చిత్రంలో చాలా ప్రజాదరణ పొందింది.మంచినీటి వంటి గొంతు కలిగిన ఈ గాయని లతా మంగేష్కర్‌ కంటే ముందు సురయ్యా, షంషాద్‌ బేగంల జమానాలో సూపర్‌స్టార్‌. అప్రమేయంగా పాట పాడటం ఆమెకు వచ్చు. గొంతు సవరించుకోవడం, ఈ శృతి ఎక్కువో తక్కువో అని నసగడం ఆమె ఎరగదు. కోల్‌కతా నుంచి పాటను తన జడపువ్వుగా ధరించి ముంబై చేరుకుంది. ఎన్నో పాటలను సువాసనలుగా వెదజల్లింది. అయితే ఇంకొన్నాళ్లు నిలిచి ఉండకుండా ఎండి తొందరగా రాలిపోయింది.


మేరా సుందర్‌ సప్‌నా బీత్‌ గయా’ అనేది ఆమె ‘దో భాయ్‌’ (1947) లో పాడిన చాలా పెద్ద హిట్‌ పాట. అందమైన కల గడిచిపోయిందని ఆ పల్లవికి అర్థం. అందమైన కలను కనడం అది తొందరలోనే గడిచిపోవడం గీతాదత్‌ జీవితంలో కూడా జరిగింది. ఆమె గురుదత్‌ స్టార్‌ డైరెక్టర్‌ కాక మునుపే, చిన్న స్థాయి నటుడిగా ఉండగానే అతణ్ణి ఇష్టపడి వివాహం చేసుకుంది. ఆ సమయానికి ఇండస్ట్రీలో ఆమె అధికురాలు. గురుదత్‌ ఆమెను నిజంగానే ప్రేమించాడు. వారిది ప్రేమపూర్వక జంటగా ఉంది. అతడు నట–దర్శకుడిగా, ఆమె గాయనిగా ఇండస్ట్రీలో పెద్ద ప్రభావం చూపారు.


గీతా దత్‌ ఓ.పి.నయ్యర్, ఎస్‌.డి.బర్మన్‌లతో గొప్ప పాటలు ఇచ్చింది. నయ్యర్‌ సంగీతంలో గీతా పాడిన ‘బాబూజీ ధీరే చల్‌నా’ (ఆర్‌ పార్‌), ‘ఠండి హవా కాలి ఘటా’ (మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55), ‘మేరా నామ్‌ చిన్‌చిన్‌చు’ (హౌరా బ్రిడ్జ్‌) ప్రేక్షకులను అత్యంత ప్రీతిపాత్రమయ్యాయి. గీతా పాడిన ‘చిన్‌ చిన్‌ చు’తో హెలెన్‌ డాన్సింగ్‌ స్టార్‌ అయ్యింది. ఇక ఎస్‌.డి, బర్మన్‌తో గీతాది తిరుగులేని జోడి. ఆయన కోసం ఆమె పాడిన ‘తద్‌బీర్‌ సే బిగ్‌డీ హుయీ’ (బాజీ), ‘జానే క్యా తూనే కహీ’ (ప్యాసా) యాభై ఏళ్లు గడిచిపోయినా నేటికీ శ్రొతల ఆదరణను చూరగొంటున్నాయి. ‘ఏలో మై హారీ పియా’ (ఆర్‌ పార్‌), ‘జానే కహా మేరా జిగర్‌ గయా జీ’ (మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ 55), ‘పియా ఐసో జియా మే సమా గయేరే’ (సాహిబ్‌ బీవీ ఔర్‌ గులామ్‌)... లాంటి ఎన్నో సుప్రసిద్ద పాటలని ఆలపించింది.


ఇన్ని పాటలు పాడిన ఈ సుమధుర గాయని, తన జీవిత చరమాంకంలో ఆర్థిక బాధలనుండి గట్టెక్కడానికి స్టేజీ షోలు చేయవలసి వచ్చింది.

ఆమె స్నేహితురాలు గాయని మీనా కపూర్ ఇద్దరూ ఒకే విధమైన స్వర శైలిని కలిగి ప్రసిద్ధిచెందారు.[2]

భర్త గురుదత్ 1964లో మరణించాడు. అతడిది ఆత్మహత్య అని అంటారు. ఆ తర్వాత గీతా దత్‌ 1972 వరకూ జీవించి మరణించింది. మరణించేనాటికి ఆమె వయసు కేవలం 41 సంవత్సరాలు మాత్రమే.

మూలాలు

మార్చు
  1. Ali, Nasir. "The Impact of Geeta Roy in Nineteen Forties". geetadutt.com. Archived from the original on 20 June 2011. Retrieved 22 February 2011.
  2. "Geeta Dutt – Musical Association with Meena Kapoor". Retrieved 8 May 2014.

బయటి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=గీతా_దత్&oldid=3887122" నుండి వెలికితీశారు