పచ్చకామెర్లు, (జాండీస్) రక్తంలో బిలిరుబిన్ యొక్క స్థాయి హెచ్చినప్పుడు (హైపర్ బిలిరుబినీమియా) చర్మము, కనుగుడ్లు మరియు మ్యూకస్ మెంబ్రేనులు పసుపు పచ్చ రంగుతేలడాన్ని పచ్చకామెర్లు అంటారు. ఈ పరిస్థితి వలన అన్ని శరీరద్రవాలలో బిలిరుబిన్ పెరుగుతుంది. సాధారణంగా, ఈ లక్షణాలు కంటికి స్పష్టంగా కనిపించాలంటే ప్లాస్మాలోని బిలిరుబిన్ యొక్క గాఢత సాధారణ విలువ అయిన 0.5 మి.గ్రా/డె.లీ[1] కంటే మూడు రెట్లకు (1.5 మి.గ్రా/డె.లీ) పైగా పెరగాలి.[2] జాండీస్ అన్న పదము ఫ్రెంచి భాషా పదమైన jaune (పసుపుపచ్చ) నుండి పుట్టింది.

పచ్చకామెర్లు, జాండీస్
వర్గీకరణ & బయటి వనరులు
హెపటైటిస్ ఏ వలన పచ్చబడిన చర్మము మరియు కనుగుడ్లు
m:en:ICD-10 {{{m:en:ICD10}}}
m:en:ICD-9 {{{m:en:ICD9}}}
DiseasesDB 7038
m:en:MedlinePlus 003243
MeSH {{{m:en:MeshID}}}


లక్షణాలు మరియు నిర్ధారణ

  • కళ్ళు తెల్ల గుడ్డు పచ్చగా , నీరుడు మూత్రం ఎర్రగా, ఆకుపచ్చగా రంగులో ఉంటే అది అసలైన లివర్ కాలేయం పచ్చ కామెర్లు.
  • కళ్ళు పచ్చగా ఉండి నీరుడు మూత్రం తెల్లగా ఉంటే అది మలేరియాలో రక్తం విరిగి కావచ్చు.
  • కళ్ళు మూత్రం పచ్చగా ఉండి, కుడి వైపు డొక్కలో శూల పోటు వస్తుంటే అది పైత్యకోశ రాళ్ళు గురించి పరీక్ష చూడవలెను.
  • ఎన్ని పరీక్షలకు దొరక్క పోతే అది రాచపుండు కేన్సర్ కావచ్చా?
  • అల్ట్రాసౌండ్ స్కాన్, మామూలు ఎక్స్-రేల్లో రాళ్ళు తెలుస్తాయ
  • ఎండోస్కోప్ /లాపరోస్కోపుల్లో కొన్ని కేన్సర్లు దొరకవచ్చు.

పచ్ఛ కామెర్లు వస్తే రోజు స్వచ్ఛమైన ఈత కల్లు తాగాలి.

చికిత్స

వైరస్ హెపటైటిస్ మామూలు లివర్ కామెర్లకు వైరస్ కారణం కాబట్టి వైద్యం లేదు. అందు చేత పసర్లు వగైరా చలామణీలో ఉన్నాయి. 15-30 రోజులు సేదతీరితే అదే తగ్గిపోతుంది. నీరసం 2 నెలలు ఉంటుంది. మాంసము, పప్పులు తగ్గించి తినాలి. ఎక్కువ తింటే మెదడుకు ఎక్కగలదు. మలేరియాకు క్లోరోక్విన్ పూర్తి కోర్సు 10 బిళ్ళలు రెండున్నర రోజులపాటు భోజనం తరువాత వేసుకుంటే పూర్తిగా తగ్గిపోతుంది. ఖరీదైన మందులు ఇంజక్షన్లు అక్కర్లేదు. వైరస్ జాండిస్ ఉన్నవారికి చేసిన ఇంజక్షన్ సూదులు మళ్ళీ వాడవలసి వస్తే ఎక్కువ మరిగించవలెను.

మూలాలు

  1. Guyton, A and Hall, J, "Textbook of Medical Physiology", 11th Ed., Elsevier, 2006
  2. Guyton, A and Hall, J, "Textbook of Medical Physiology", 11th Ed., Elsevier, 2006